నాయకుల ప్రవర్తన ఓటర్లపై చాలా ప్రభావం చూపిస్తుంది.. ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో ప్రచారం జోరులో రోడ్ల పక్కనే స్నానాలు చేశారు. రోడ్డు పక్కన ఉండే హోటళ్లలోనే తిన్నారు. వెండితెర వేల్పుగా వెలుగొందిన ఎన్టీఆర్ అలా ప్రజల్లోకి దూసుకురావడం ఓ సంచలనం. 


ఆ తర్వాత చాలా మంది నాయకులు వచ్చినా ఎన్టీఆర్ ను మరిపించలేకపోయారు. తాజాగా పవన్ కల్యాణ్ ప్రచారం తీరు.. వ్యవహారశైలి, ప్రవర్తన ఒకనాటి ఎన్టీఆర్‌ను తలపిస్తున్నాయి. ఆయన పంచెకట్టు.. జనంలో కలసిపోవడం.. రోడ్డు పక్కన ఓ మట్టి పిడతో చల్లతో భోజనం చేయడం.. అభిమానుల ఇళ్లకు వెళ్లిప్పుడు నేలపైనే కూర్చోవడం వంటి దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. 


అయితే కేవలం ఇలాంటి ప్రవర్తన, దృశ్యాలు ఓట్లు రాలుస్తాయా అంటే.. చెప్పలేం. కానీ ఇలాంటి ప్రచారం.. మీడియా పబ్లిసిటీ అభిమానులకు కొండంత ఉత్సాహాన్నిస్తుంది. ఈ యాటిట్యూడ్ తటస్థ ఓటర్లపై కొంతవరకూ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. సామాన్యుడి తరహా ప్రవర్తన నాయకులను ప్రజలకు దగ్గర చేస్తుంది. 

ఇటీవల పవన్ కల్యాణ్ జగన్‌ పై విరుచుకుపడటంతో ఎల్లో మీడియా కూడా ఆయనకు పబ్లిసిటీని పెంచింది. అందులోనూ పవన్ వైఖరి భిన్నంగా ఉండటంతో ఇలాంటి ఫోటోలు, వీడియోలకు ఎల్లో మీడియా మంచి పబ్లిసిటీ ఇస్తుంది. మరి ఈ పబ్లిసిటీ పవన్‌కు ఏ మేరకు ఓట్లు రాలుస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: