కేఏ పాల్.. ఇప్పుడు ఈ పేరు తెలియనివారు ఉండరు.. ఆయన పేరు వినగానే ముఖాలపై నవ్వు ఆటోమేటిగ్గా వస్తుంది. ఎందుకు.. ఆయన చెప్పే మాటలు అలాంటివి..ఏమాత్రం జరగే అవకాశం లేని అంశాలను కూడా ఆయన విపరీతమైన ఆత్మవిశ్వాసంతో చెబుతుంటారు. కాబోయే సీఎం నేనే అంటారు.. ఇంకెవరికీ డిపాజిట్లు రావంటారు..


సీఎం అయితే నియోజకవర్గానికి వందకోట్లు ఇస్తానంటారు.. అమెరికా ప్రెసిడెంటును ఏపీకి రప్పిస్తానంటారు. లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తానంటారు. విదేశాల నుంచి లక్షల కోట్లు ఫండ్లు తెస్తానంటారు. కేఏ పాల్ బ్యాంకులు పెడతానంటారు. అందులోనూ ఇవన్నీ కచ్చితంగా జరిగితీరుతాయన్నంత విశ్వాసంతో చెబుతుంటారు.

అయితే ఇప్పుడు కేఏ పాల్‌కు పోటీగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తయారవుతున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో జనసేన సత్తా ఏంటో అందరికీ తెలుసు. ప్రజారాజ్యం స్థాయిలో సీట్లు తెచ్చుకున్నా గోప్పే అన్న భావన ఉంది. పవన్‌కు20 స్థానాల వరకూ వచ్చి హంగ్‌ ఏర్పడినే పవన్ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి.

కానీ ఇప్పుడు అలాంటి సీన్ ఏమాత్రం కనిపించడంలేదు. కానీ పవన్‌ మాత్రం ప్రతిరోజూ.. నేనే సీఎం అవుతానని ఢంకా భజాయిస్తున్నాడు. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోయేది తానేనని చెబుతున్నాడు. ఆ చెప్పడం కూడా పాల్‌ కాన్ఫిడెన్స్ కు ఏమాత్రం తగ్గకుండా చెబుతున్నాడు. దాంతో పవన్‌ లో కేఏ పాల్ కనిపిస్తున్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: