కృష్ణాజిల్లాలోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గ‌న్న‌వ‌రం. అనేక రూపాల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ వార్త‌ల్లో నిలు స్తూనే ఉంది. ఇక్క‌డ విమానాశ్ర‌యాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయ‌డం, ఇక్క‌డి చెరుకు రైతుల స‌మ‌స్య‌లు, మూత బ‌డిన చ‌క్కెర క‌ర్మాగారాన్ని తిరిగి తెరిపించ‌డం వంటి కీల‌క అంశాలు ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గానే చేస్తున్నాయి. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో మ‌రింత‌గా హాట్ హాట్ గా మారింది. ఇక్క‌డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గా టీడీపీ నాయ‌కులు వ‌ల్ల‌భ‌నేని వంశీ ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ నాయ‌కుడు దుట్టా రామ‌చంద్ర‌రావు పై దాదాపు 10 వేల ఓట్ల మెజారిటీతో వంశీ విజ‌యం సాధించారు. 


గ‌డిచిన ఐదేళ్ల కాలంలో సిట్టింగ్ ఎంపీపై ఇక్క‌డ ప్ర‌జ‌లు కొంత పాజిటివ్‌గా, కొంత నెగిటివ్‌గా ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఒకింత ఆగ్ర‌హంతో ఉన్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంతో పోరాడ‌డంలోనూ, నిధులు స‌మీక‌రించ‌డంలోనూ మిగిలిన ఎమ్మెల్యేల‌తో పోలిస్తే.. వంశీ వెనుక‌బ‌డి ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గన్న‌వ‌రం చ‌క్కెర ఫ్యాక్ట‌రీని తిరిగి తెరిపిం చే క్ర‌మంలో వంశీ.. ఇక్క‌డి రైతుల‌ను వెంట‌బెట్టుకుని మ‌రీ అమ‌రావ‌తికి వెళ్లిన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను రైతులు ఇప్ప‌టికీ చ‌ర్చించుకుంటున్నారు. ఇక‌, గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం విస్త‌ర‌ణ‌కు సంబంధించిన ప్యాకేజీ ఇంకా పూర్తిగా అంద‌క‌పోవ‌డం కూడా ఇక్క‌డ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 


గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, కాంగ్రెస్ త‌ర‌ఫున సుంక‌ర ప‌ద్మ‌శ్రీ పోటీ చేస్తున్నా రు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి సీపీఐ నాయ‌కుడు, మైనార్టీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని పోటీ చేయిస్తు న్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డ బ‌ల‌మైన వ‌ర్గంగా చ‌క్రం తిప్పిన దాస‌రిబాల‌వ‌ర్ధ‌న‌రావు, జైర‌మేష్‌లు ఇప్పుడు వైసీపీకి జైకొట్టారు. కొన్ని ద‌శాబ్దాలుగా టీడీపీలో ఉండి.. గ‌తంలో ఎమ్మెల్యేగా గెలిచిన బాల‌వ‌ర్ధ‌న‌రావుకు నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు ఉండ‌డం, జైర‌మేష్‌కు కూడా ప‌లుక‌బ‌డి ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాలు ఇక్క‌డ వైసీపీకి ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు. ఇక‌, యార్ట‌గ‌డ్డ వెంక‌ట్రావుకు కూడా స్తానికంగా మంచి ప‌లుకుబ‌డి ఉండ‌డం క‌లిసి వ‌స్తోంది. గ‌డిచిన ఐదేళ్ల‌లో వంశీ కొన్ని సాధించినా .. కొన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మాత్రం ఇప్ప‌టికీ అలానే ఉండిపోవ‌డం ఒకింత మైన‌స్‌గా మారింది. దీంతో గెలుపు గుర్రం వైసీపీ దిశ‌గా సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: