ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అనూహ్య నిర్ణయాలతో చింతలపూడి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో తెదేపా తరుపున భారీ మెజారిటీతో గెలిచిన పీతల సుజాతకి ఈ సారి టికెట్ దక్కలేదు. ఈమె స్థానంలో 2009 ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన కర్రా రాజారావుని ఈ సారి ఎన్నికల్లో బరిలో దించారు. పీతల సుజాత తీరుతో నియోజకవర్గంలో వర్గ విభేదాలు పెరిగాయి. సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గాలుగా విడిపోయి కొన్ని పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒకటే వర్గం పాల్గొన్న ఘటనలు ఉన్నాయి. పైగా రెండు సంవత్సరాలు మంత్రిగా ఉన్న సుజాత చేసింది ఏం లేదనే టాక్ ఉంది.


దీంతో మళ్ళీ సుజాతకి టికెట్ ఇస్తే ఓడటం ఖాయమని ఆమె వ్య‌తిరేక వ‌ర్గం బాగా ప్ర‌చారం చేసింది. స్థానికుడు కావ‌డంతో రాజారావుకి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సుజాత వలన పార్టీ మీద వచ్చిన వ్యతిరేకత కూడా తగ్గే అవకాశం ఉంది. పైగా 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి..తర్వాత వైకాపాలో పని చేసిన ఘంటా మురళి తెదేపాలోకి రావడం ప్లస్. కానీ ప్రభుత్వ వ్యతిరేకత...సుజాత వర్గం అసంతృప్తిగా ఉండటం మైనస్.


అటు వైకాపా కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన దేవీప్రియని పక్కనబెట్టి వీఆర్ ఎలీషాని బరిలో దింపారు. ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత, వైకాపాకి పెరిగిన బలం ప్లస్ కానున్నాయి. అయితే నియోజకవర్గంపై పట్టున్న ఘంటా మురళి పార్టీని వీడటం, జనసేన పోటీలో ఉండటం మైనస్. ఇక జనసేన నుంచి మేకల ఈశ్వరయ్య పోటీ చేస్తున్నారు.  పవన్ ఇమేజ్, గతంలో ప్రజారాజ్యంకి పడిన ఓట్ల లెక్క బట్టి చూస్తుంటే జనసేన మిగతా పార్టీలకి పోటీ ఇస్తుంది.  


ఈ నియోజకవర్గంలో ఎస్సీ, కాపు ఓటర్లు ఎక్కువ..వీరే అభ్యర్ధుల గెలుపోటములని డిసైడ్ చేస్తారు. ప్రస్తుత పరిస్థితిలని బట్టి చూస్తుంటే తెదేపా-వైకాపాల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కానీ జనసేన చీల్చే ఓట్ల ప్రభావం వలన ఏ పార్టీ లాభపడుతుందో...నష్టపోతుందో చూడాలి. మరి ఈ సారి చింతలపూడి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో?


మరింత సమాచారం తెలుసుకోండి: