ఏపీలో ప్రచారం జోరందుకుంది. నామినేషన్లు కూడా ముగియడంతో ప్రచారం మహా స్పీడుగా సాగుతోంది. ఓవైపు చంద్రబాబు రోజుకు ఐదారు సభలు పెట్టి హోరెత్తిస్తున్నారు. మరోవైపు జగన్ కూడా రోజుకు ఐదారు సభలు నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలూ ఇలాగే ఉన్నాయి. 


ఇలాంటి కీలక సమయంలో 26వ తారీఖు జగన్ ప్రచారానికి బ్రేక్ చెప్పారు. హైదరాబాద్ లోటస్ పాండ్ కే పరిమితమయ్యారు. అలాగని చేరికలు వంటి ఇతర కార్యక్రమాలు ఉన్నాయా అంటే అదీ లేదు. మరి ఇంత కీలక సమయంలో జగన్ ఎందుకు ఒక్క రోజు సైలంటయ్యారు. 


ఇందుకు సమాధానం ఓ రేంజ్‌లో వినిపిస్తోంది. హైదరాబాద్ లో జగన్ విశ్రాంతి కోసం రాలేదు. ఓ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారట. అదేమింటంటే.. పార్టీ మేనిఫెస్టో.. ఇంతవరకూ ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలు ప్రకటించలేదు. ఒక పార్టీని చూసి మరోపార్టీ కొత్త హామీలు ప్రకటిద్దామని వెయిట్ చేస్తున్నాయి. 

ఇంతలోనే ప్రచారంలో ఉన్న చంద్రబాబు పెన్షన్‌ ను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుతామని ప్రకటించారు. అందుకే అలాంటి హామీలను తలదన్నేవి.. ఓట్లు కురిపించే హామీల రూపకల్పలో జగన్ ఓ రోజంతా సమయం వెచ్చించారట. మరి అలా రూపొందించిన ఆ మేనిఫెస్టో ఎలాంటి సంచలనానికి దారి తీస్తుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: