ప్రశ్నిస్తానంటూ వచ్చిన జనసేన పార్టీ రాను రాను తెలుగుదేశానికి తోక పార్టీగా మారిపోయింది. టీడీపీ బీ టీమ్ అంటూ వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పార్టీపై విమర్శల జోరు పెంచారు. అటు జనసేన పార్టీ చేసే పనులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటున్నాయి. 


ప్రత్యేకించి మంగళగిరి సీటు విషయంలో జనసేన వైఖరి పవన్ కల్యాణ్ అసమర్థతకు చిహ్నంగా మారింది. పవన్ నిర్ణయం తీసుకోవడంలో వైఫల్యానికి, లోపాయికారీ ఒప్పందాలకు ఓ నిదర్శనంగా నిలుస్తోంది. కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరిలో తాను పోటీకి దిగకూడదన్న జనసేన నిర్ణయం ఆ పార్టీ చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తిస్తోంది.  

లోకేశ్ గెలుపుకు సహకరించేందుకే జనసేన మంగళగిరి సీటును సీపీఐకి వదిలేసిందని విమర్శలు వచ్చాయి. కనీసం సీపీఎం కు కూడా ఇవ్వకుండా బలహీనమైన సీపీఐకి ఇవ్వడం ద్వారా జనసేన టీడీపీకి సహకరిస్తుందని జోరుగానే ఆరోపణలు వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ మరోసారి ఒత్తిడికిలోనయ్యారు. 

సోమవారం నామినేషన్లకు చివరి రోజు. అప్పటిదాకా నిద్రపోయిన పవన్ కల్యాణ్‌.. ఆ రోజు పోటీకి రెడీగా ఉండమని జనసేన మంగళగిరి నాయకులకు కబురు పంపారు. దీంతో అంతటా ఉత్కంఠ.. తమకిచ్చిన స్థానంలో జనసేన పోటీ ఏంటని సీపీఐ నాయకులు కస్సుమన్నారు. దీంతో మళ్లీ పవన్ డైలమాలో పడ్డారు. చివరకు మంగళగిరి సీటును సీపీఐకే వదిలేశారు. ఈ మొత్తం వ్యవహారం పవన్ కల్యాణ్ నాయకత్వలేమికి, అసమర్థతకు, ఊగిసలాట ధోరణికి, చపలచిత్తానికి ఓ పెద్ద ఉదాహరణ. 



మరింత సమాచారం తెలుసుకోండి: