ఏపీలో తెలుగుదేశం నేతల తీరు రోజు రోజుకూ అరాచకంగా తయారవుతోంది. రాజ్యాంగ వ్యవస్థలను కూడా అంగకరించలేని దుస్థితి నెలకొంటోంది. అంతా తాము అనుకున్నట్టే జరగాలి..తాము చెప్పిందే వినాలి.. తాము చేసిందే ధర్మం.. తాము ఆచరించేదే న్యాయం.. అన్నట్టు తయారైంది వారి పరిస్థితి. 

తాజాగా.. ఎన్నికల సంఘం విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నామమాత్రం అవుతారు. అన్ని వ్యవస్థలూ ఈసీ కంట్రోల్ లోకి వచ్చేస్తాయి. ఎలాంటి కీలక నిర్ణయాలు కూడా సీఎం తీసుకోవడానికి వీలుండదు. 


ఈ నిబంధనలు దశాబ్దాలుగా అమల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా చంద్రబాబు సర్కారు ఈసీని కూడా తప్పుబట్టే పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో సీబీఐ దాడులు జరుగుతున్నాయని.. సీబీఐకి నో ఎంట్రీ అంటూ జీవోలు జారీ చేసుకున్నారు. ఐటీ అధికారుల దాడులపైనా విమర్శలు చేస్తున్నారు. ఈడీ దాడులు చేసినా గగ్గోలు పెడుతున్నారు. 

ఇప్పుడు ఈసీపైనా రెచ్చిపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ చంద్రబాబు ఈసీకి ఏకంగా ఏడు పేజీల లేఖ రాశారు.  ఈసీ సహజ న్యాయానికి విరుద్దంగా ఈసీ వ్యవహరిస్తోందని చంద్రబాబు అంటున్నారు. మరి అదే సహజ న్యాయ సూత్రం ఈసీకి, సీబీఐకీ, ఐటీకీ, ఈడీకీ ఉండదా అని ప్రశ్నిస్తే బాబు దగ్గర సమాధానం ఉందా అంటున్నారు విశ్లేషకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: