ప్రస్తుతం ఏపీ లో ఐపీఎస్ ల బదిలీలు రాష్ట్రంలోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపుతోంది. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కాస్త ఎక్కువగా స్పందిస్తున్నారు. ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుకు ఎన్నికల సంఘం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనీ. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి.

ఈ విషయం పై ఏపీ ప్రభుత్వం హైకోర్టు ను ఆశ్రయించింది. వారి బదిలీని తప్పు పడుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం కోర్టు విచారణ జరపబోతుంది. ఏపీ నిఘా విభాగాధిపతి వెంకటేశ్వరరావు సహా శ్రీకాకుళం, కడప ఎస్పీలను ఎన్నికల సంఘం తప్పించిన సంగతి విదితమే. ఈ విషయాన్ని వైతిరేకిస్తు తెలుగు దేశం పార్టీ ఖండించింది. 


వైసీపీ వాళ్ళ వాదన మాత్రం ముగ్గురు అధికారులను బదిలీ చేస్తేనే వారికి ఇబ్బంది అయితే మొత్తం పోలీసు బల్గాన్ని అంతా వారి గుప్పిట్లో పెట్టుకున్నారు కదా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఆ ముగ్గురు అధికారాలు ఏపీ లోని అధికార ప్రభుత్వానికి మద్దతు గా నిలుస్తుంది అని వారు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అసలు ఎన్నికల సంఘం కి సంబంధం లేని వారిని ఎలా బదిలీ చేశారంటూ ఆ పిటిషన్ లో పేర్కొంది. దీంతో హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చి పిటిషన్ పై వాదనలు వినిపించాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: