ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ హవా స్పష్టంగా కనబడుతోంది. గత సార్వత్రిక ఎన్నికలలో రైతులకు రుణమాఫీ చేస్తారని ఒక్క హామీ జగన్ ఇచ్చి ఉండి ఉంటే ఈ పాటికి ఆంధ్రరాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఉండేవాడిని అయితే రైతుల విషయంలో ముందు నుండి చాలా సున్నితంగా వైసీపీ పార్టీలో పెద్దపీట వేస్తూ వచ్చిన జగన్ ...గత ఎన్నికలలో రైతులను మోసం చేసే హామీ ఇవ్వకుండా హుందాగా వ్యవహరించారు. అయినా కానీ గత సార్వత్రిక ఎన్నికలలో కొద్దిపాటి తేడాతో అధికారం కోల్పోయిన వైయస్ జగన్ రాబోతున్న ఎన్నికలలో పక్కా ప్రణాళికలతో పగడ్బందీ తో అధికార పార్టీ టీడీపీ కి చుక్కలు చూపిస్తూ సామాన్యులకు ధైర్యాన్నిస్తూ సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.


ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇటీవల వైఎస్ జగన్ ఇచ్చిన హామీ పట్ల ఎంతగానో సంతోష పడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోతున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న రైతులకు పదివేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు అంతే కాకుండా ఇంకా చాలా హామీలను రైతులకు జగన్ ఇవ్వడంతో రాబోతున్న ఎన్నికలలో జగన్ కి ఓటు వేయడానికి రాష్ట్రంలో ఉన్న రైతులు ఎంతగానో సంతోషిస్తున్నట్లు రాష్ట్రంలో జరుగుతున్న పలు సర్వేల లో..తేలింది.


మొత్తం మీద రైతులకు వైయస్ జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ పట్ల ఏపీ రైతులు మరియు ప్రజలు వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు జగన్ వస్తే బాగుంటుంది అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: