లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు. నా స్పీచ్ ఇంతే అన్న రీతిలో సాగిపోతుంది లోకేష్ గారి ప్రచారం. ఇన్నిరోజులూ నోరు జారిందంతా ఒకఎత్తు.. ఎన్నికల ప్రచార సభల్లో లోకేష్ బాబు తన టాలెంట్ ను పూర్తిగా చూపెట్టేస్తున్నారు. దాచుకునేది ఏమీలేదు.. అన్నట్టుగా లోకేష్ తన పూర్తి టాలెంట్ ను జనం ముందు చూపెడుతూ ఉన్నారు. ప్రత్యేకించి ప్రసంగాల్లో లోకేష్ బాబు ‘దూసుకుపోతూ’ ఉన్నారు.  


లోకేష్ ప్రసంగిస్తే చాలు.. ప్రత్యర్థులకు బోలెడన్ని ఆయుధాలు లభిస్తూ ఉన్నాయి. ఈ ప్రసంగాలే చేయకుండా ఉంటే..లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా అయినా సులువుగా నెగ్గేవారేమో కానీ.. ఆయన ప్రసంగాలను వింటుంటే.. మంగళగిరి జనాలు కూడా ఆలోచనలో పడిపోతూ ఉన్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పోలింగ్ తేదీ ఏప్రిల్ తొమ్మిది అని చెప్పడం.. కేసీఆర్ వచ్చి మచిలీపట్నం పోర్టును ఎత్తుకెళ్లిపోతాడని లోకేష్ వ్యాఖ్యానించడం..మంగళగిరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నేతను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడమా..అనే సంకోచంలోకి పడిపోతున్నారట లోకేష్ కు ఓటేద్దామనుకునే వాళ్లు కూడా!


ఆ సంగతలా ఉంటే.. తాజాగా లోకేష్ బాబు.. మరిని మణిమాణిక్యాలను వదిలారు. ‘ఈ రోజు ప్రభుత్వం ముందళికెళ్లింది.. ఊ..ఆ.. అంటే..’అని తన వాగ్దాటిని కొనసాగించబోతూ లోకేష్ బాబు ఒక బూతు పదం వదిలారు. ఏమిటీయన పచ్చిబూతులు మాట్లాడుతున్నారని చాలామంది ఆలోచనలో పడిపోయారు. అయితే లోకేష్ కవి భావం వేరే. డెంగీ జ్వరం వచ్చేది అని చెప్పబోయి.. అచ్చ తెలుగు నాటు బూతును మాట్లాడారు లోకేష్. డెంగీ జ్వరాన్ని చదువురాని నిరక్షరాస్య జనాలు కూడా అర్థవంతంగా పలుకుతారు. డెంగీ అని, డెంగ్యూ అని.. ఎవరికి తోచినట్టుగా వారు పలుకుతారు. లోకేష్ మాత్రం తనకు తోచినట్టుగా పలికారు. దాన్నొక బూతుగా మార్చారు!

మరింత సమాచారం తెలుసుకోండి: