ఫోన్ ట్యాపింగ్.. కొన్నాళ్ల క్రితం ఏపీ- తెలంగాణ మధ్య సెగలు రేపిన కేసు.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్వరాన్ని తెలంగాణ పెద్దలు పట్టుకుంటే.. అమ్మా.. మా ఫోన్లు ఎలా ట్యాప్ చేస్తారు అంటూ లాజిక్ లాగి చంద్రబాబు నానా రచ్చ చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. 


కానీ ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోందట. వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయట. ఇప్పుడు ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. తమ పార్టీ నేతల ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు  హైకోర్టు లో పిటీషన్ వేశారు. దీనిపై  హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఇంటలిజెన్స్ వెంకటేశ్వరరావు పెద్ద వ్యవస్థను తయారుచేశారని వైసీపీ నేతలు అంటున్నరాు. విదేశాల నుంచి ఇందుకు కావాల్సిన టెక్నాలజీని అక్రమంగా తెప్పించి, 20 మంది హ్యాకర్లను పెట్టుకొని ఫోన్లు ట్యాప్ చేస్తున్నారట. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి వైసీపీ నేతలు ఆధారాలు కూడా సమర్పించారట. 

ప్రధానంగా జగన్, షర్మిల, విజయమ్మల పాదయాత్రలు కోఆర్డినేట్‌ చేసే తలశిల రఘురామ్ ఫోన్ ను ట్యాప్ చేయమని సెల్ ఫోన్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖలను వైసీపీ నేతలు బయటపెట్టారు. కొద్దిరోజులుగా తమ పార్టీకి చెందిన నేతల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: