కేకే సర్వే.. ఇప్పుడు సోషల్ మీడియాలో పరిచయం ఉన్నవారికి బాగా తెలిసిన పేరు. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరైన ఈ కేకే ఇప్పుడు సర్వేలు నిర్వహిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ పాపులర్ అయ్యారు. చాలా సీరియస్ గానే ఈ సర్వేలు నిర్వహించినట్టు తెలుస్తోంది. 


ఆయన అంచనాల ప్రకారం.. ఏపీలో ఏ కులం ఓటింగ్ ఎవరివైపు మొగ్గుతుందో ఓసారి పరిశీలిద్దాం..ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. ఓ కులం మొత్తం ఓ పార్టీకే ఎప్పుడూ ఓటు వేయదు.. కానీ అందులో ఎక్కువ శాతం ఎటు మొగ్గుతున్నారన్నదే  ఈ సర్వే వివరిస్తోంది. 

పార్టీలకు హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఓ 15 శాతం వరకూ ఉంటారు. వారు కచ్చితంగా అభిమాన పార్టీకే వేస్తారు. ఇక కులాల వారీగా పరిశీలిస్తే.. కాపు ఓట్లు ఎక్కువగా జనసేనకు.. కమ్మల ఓట్లు తెలుగుదేశానికి, రెడ్డిల ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఎక్కువగా ఉంది. 

బీసీ ఓటు బ్యాంకు సాధారణంగా టీడీపీకి ఫేవర్ గా ఉండేవారు.కానీ ఇప్పుడు ఆ శాతంలో తగ్గుదల కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, క్రిస్టియన్‌ లో వైసీపీకి ఎక్కువగా ఆదరణ కనిపిస్దతోంది. ఇందులో మరో కోణం ఏమిటంటే ప్రాంతాలను బట్టి కూడా పార్టీలకు ఆదరణ ఉంటోంది. 

ఉదాహరణకు.. ఈస్ట్ గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి ఆదరణ కనిపిస్తోంది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైసీపీకి ఆదరణ బాగా ఉంది. ఇక వయస్సుల వారీగా చూసుకుంటే.. 18 నుంచి 35 ఏళ్ల వయసువారిలో ఎక్కువగా జనసేనకు ఆకర్షితులవుతున్నారట. 
ఇక మిగిలిన వయస్సు వారిలో వైసీపీ, టీడీపీకి ఆదరణ లభిస్తోందట. ఇక మరికొందరు పార్టీలపై ఎలాంటి అభిమానం లేకపోయినా ఓసారి అవకాశం ఇచ్చి చూద్దామంటూ ప్రయత్నించేవారు ఉంటారట. వారి శాతం పెరిగితే వైసీపీకి లాభం కలుగుతుంది. ఇదీ ప్రాంతాలు,కులాలు, వయస్సులవారీగా కేకే సర్వే రిపోర్ట్.



మరింత సమాచారం తెలుసుకోండి: