పశ్చిమ గోదావరి జిల్లాలో ఆది నుంచి టీడీపీ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ వ్యూహ్మాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. ఇక్కడి వర్గ విభేదాలను ఒక్క నిర్ణయంతో చెక్ పెట్టారు. ఇప్పుడా నిర్ణయమే ఏలూరులో వైసీపీకి విజయం దక్కేలా చేస్తోంది.సీనియర్ రాజకీయ నాయకుడు అందరినీ కలుపుకొని పోతారనే పేరు వైసీపీ ఏలూరు అభ్యర్థి ఆళ్ల నానికి ఉంది. ప్రజలపైన ప్రభావం చూపిస్తారనే ఉద్దేశంతోనే జగన్, ఆళ్ల నానికి పగ్గాలు అప్పగించారు. దీంతో ఇక్కడ వైసీపీ జోరు పెరుగుతోంది.

ఈ ఎన్నికల్లో టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా వైసీపీ ఆళ్ల నానిని దించింది. టీడీపీని ఎదురించే శక్తి కూడా నాని వల్ల జగన్ కు వచ్చింది. అయితే ఇక్కడ బలమైన నాయకుడిగా ఉన్న బడేటి బుజ్జిని అలియాస్ కోట రామారావును ఆళ్ల నాని నిలువరిస్తాడా లేదా అన్నది ప్రధాన సందేహంగా మారింది. టఫ్ ఫైట్ లో ఆళ్ల నానికే ఎక్కువ అవకాశాలున్నాయని తేలింది.ఇక ఏలూరు అసెంబ్లీ పరిధిలో కాపు ఓట్లు ఎక్కువ. అందుకే జనసేన కూడా ఇక్కడ పోటీ పెట్టింది. కాపు సామాజికవర్గానికి చెందిన రెడ్డి అప్పల నాయుడు బరిలో ఉన్నారు. నిజానికి ఈ సీటుపై పవన్ కళ్యాణ్ కూడా పోటీచేస్తాడని వార్తలొచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాపు ఓట్లతో ఈజీగా పవన్ గెలువవచ్చని రిపోర్టులు అందాయి.

కానీ ఎందుకో జనసేనాని పవన్ ఇక్కడికి మొగ్గు చూపలేదు. నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న రెడ్డి అప్పలనాయుడును బరిలో దించాడు. అయితే తాజాగా 2019 ఎన్నికల వేళ టీడీపీలో ఏలూరు నియోజకవర్గంలో వర్గం పోరు పెరగడం టికెట్ కోసం కీచులాడుకోవడంతోనే నేతలు పరిమితమయ్యారు. దీంతో  బలమైన ఆళ్ల నానిపై పోటీకి మరోసారి  బుజ్జిని టీడీపీ బరిలోకి దింపింది. కానీ టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు బుజ్జిని తీవ్రంగా వ్యతిరేకేస్తున్నారు.  కింది స్థాయి టీడీపీ కేడర్ కూడా బుజ్జిని వ్యతిరేకిస్తోంది. ఇది వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి అనుకూలంగా ఉంది. అయితే జనేసేన అభ్యర్థిని తక్కువ అంచనావేయడానికి వీల్లేదు. ఆ కాపులు ప్రభావం చూపితే ఏమైనా జరగొచ్చు.  సో ఏలూరులో ప్రస్తుతానికి త్రిముఖ పోరు నెలకొందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: