వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి అధికార పార్టీ మరియు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు అయిన కే.ఏ.పాల్, ఏపీ డీ .జీ. పీ ఠాకూర్ పైన ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ లో ఎలక్షన్ కమీషన్ ను ఆశ్రయించారు. ఆయన ముందుగా కే. ఏ పాల్ 39 మంది అభ్యర్థులను తమ వైసీపీ పార్టీని పోలిన పేర్లను ఉంచి అలాగే ఫ్యాన్ గుర్తుని పోలే హెలికాప్టర్ గుర్తును తమ పార్టీకి పెట్టడమే కాకుండా వాళ్ళ పార్టీ కండువాను కూడా తమ పార్టీని పోలినట్లు డిజైన్ చేయడం సబబు కాదని విన్నవించుకున్నారు.

చంద్రబాబు తో డబ్బు పుచ్చుకొని లాలూచీ కుదుర్చుకున్న కే.ఏ.పాల్ తమ పార్టీని దెబ్బతీసేందుకు పని చేస్తున్నారు అని ఆయన అన్నాడు. ఇకపోతే డీ.జీ.పీ ఠాకూర్ అమరావతి నుండి ప్రకాశం జిల్లాకు అక్రమంగా 35 కోట్లు తరలించారు అని ఆయన ఆరోపించారు. తమ పైన శ్రీకాకుళం ఎస్పీ విషయంలో కేసు పెట్టినట్లు తమ ఆరోపణలు తప్పు అని నిరూపిస్తూ దమ్ముంటే కేసు పెట్టమని సవాల్ చేశారు విజయ్ సాయి రెడ్డి.

ఇక పోతే రాష్ట్రంలో అత్యుత్తమ కేడర్ లో ఉన్న ఠాకూర్ బండిని ఆపే ధైర్యం ఏ పోలీసుకు లేదని, అందుకే చంద్రబాబు అండతో ఠాకూర్ ఇలాంటి పనులు చేస్తున్నారు అని అన్నారు. ఎన్నికల కమీషన్ వీరి ఆరోపణలు ఎంత వరకు పరిగణిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: