పవన్ కళ్యాణ్ సొంత ఊరు అయిన పాలకొల్లులో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ కు సూటైన ప్రశ్నలు సంధించారు. ముందుగా పవన్ కళ్యాణ్ ను ఒక యాక్టర్ గా, చంద్ర బాబు డైరెక్షన్ లో నటిస్తున్న పార్టనర్ గా ఆయన పేరు పెట్టారు.

ఆ తరువాత ఆయన పవన్ ను ఒక ప్రశ్న అడిగారు. తనకు జరిగినట్లుగా పవన్ కుటుంబంలోనే ఒకరిని చంపేసి చివరికి అతని ఎల్లో మీడియా ద్వారా ఆ తప్పుని పవన్ మీదే వేసేస్తే తాను ఏం చేస్తారో చెప్పమని అడిగాడు. జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి పులివెందుల లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. 

ఇక పోతే పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ గా 4 సంవత్సరాలు బాబు చేతిలో కీలు బొమ్మగా ఉండి, సంసారం చేసి మళ్లీ చివరి సంవత్సరంలో విడాకులు తీసుకున్నట్లు నటిస్తున్నారు అని జగన్ విమర్శించారు. ఇన్నేళ్లు చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలలో పవన్ వాటా ఎంత అని ప్రశ్నించారు. ఇలా తన సొంత ఊరిలోనే జగన్ పవన్ ను కడిగి పారేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: