జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేస్తున్న ప్రసంగాలు చూస్తే.. ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారో ఇట్టే అర్థం అవుతుంది. విపక్ష నేతగా ఉన్న ఆయన మరో ప్రతిపక్షనేతను టార్గెట్ చేసుకోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. అందుకే పవన్, చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడని వైసీపీ నేతలు ఆరోపించేందుకు ఆస్కారం ఏర్పడింది. 


ఐతే.. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుమ్మక్కయ్యారంటున్న వైసీపీ నేతలు అందుకు ఓ వీడియోను సాక్ష్యంగా చూపుతున్నారు. టిడిపి నేత, గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణ చేసిన ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఓ గ్రామంలోని తెలుగుదేశం శ్రేణులతో మాట్లాడిన వీడియోలో ఈ కుట్ర పక్కాగా బట్టబయలైందంటున్నారు. 

అమలాపురంలో జరిగిన పార్టీ శ్రేణుల అంతర్గత సమావేశంలో టిడిపి నేతలకు మెట్ల రమణ హితబోధ చేశారు.  ఆయన ఏమన్నారంటే..  జనసేన నాయకులు, కార్యకర్తలకు ఈ విషయాన్ని చెప్పాలి.. జనసేనలో కాపు యువత కావచ్చు..  లేదా వేరే యువత కావచ్చు.. జనసేన  అన్నప్పుడు మనం వివరించి చెప్పాలి. 

వారందరికీ ఒకటే విషయాన్ని చెప్పండి.. మీ ఓటు వృథా చేయవద్దు.. ఈ సారికి ఇలా చేయండి.. తర్వాత  పవన్‌ కల్యాణ్‌కు ఇంకా వయస్సు ఉంది. భవిష్యత్‌ ఉంది.. ఆయన సంగతి అప్పుడు అలోచిద్దాం అని చెప్పండని రమణబాబు పార్టీ నాయకులకు సూచించారు.  ఎందుకంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ బద్ధశత్రువులుగా లేరు. 

గతంలో మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్‌ క్రియేట్‌ అయిందే తప్ప వారిద్దరి మధ్య ఏ విధమైన పొరపొచ్చాలు లేవు. ఇప్పుడు కూడా ఇద్దరూ కలిసే ఉన్నారు. ఇదే విషయాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలకు చెప్పండని వివరించారు. రెండు పార్టీల అధినేతల మధ్య ఉన్న సంబంధాన్ని ఓ పార్టీ నేత అంత క్లియర్‌గా చెప్పాక ఇంకా అనుమానమెందుకని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: