వచ్చే ఎన్నికల్లో గెలవలేనని చంద్రబాబు భావిస్తున్నారా.. ఆయన దింపుడు కల్లం ఆశతో చివరి ప్రయత్నాలు చేస్తున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది. ఐదేళ్లు పాలించిన ఓ నాయకుడు తన పాలనపై తీర్పు కోరకుండా.. ఎంతసేపూ ప్రత్యర్థులపై విమర్శలతోనే ఎన్నికల ప్రచారం సాగిస్తున్న తీరు చూస్తే చంద్రబాబుకు ఫ్యూచర్‌ కళ్లముందే కదలాడినట్టు అనిపిస్తోంది.  


రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏం జరిగినా, కర్త, కర్మ, క్రియ తానే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. గతంలో ఇలాంటివి చాలాచూశాం కూడా. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు ఆ సంగతి మరిచిపోయారు. తాను ఐదేళ్లూ పదవిలో ఉన్న సంగతీ మర్చిపోయినట్టున్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబుచేస్తున్న ప్రతి ప్రసంగం కూడా ఆయన తన ఓటమిని ముందుగానే అంగీకరించినట్లుగా ఉన్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తాను చేసింది చెప్పుకోకుండా, కేవలం ప్రజలల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బాబు ప్రయత్నించడం ఆయన రేంజ్‌కు కొత్తే. 

చంద్రబాబు ఎంతసేపూ  తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రతిపక్ష జగన్ చేతులు కలిపారంటూ బద్నాం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జనంలో సెంటిమెంటును రగిల్చి, తన ఐదేండ్ల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు చేతులెత్తేశారనేందుకు నిదర్శనమనే విశ్లేషకులు ఫీలవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: