చంద్రబాబునాయుడుకు సొంత జిల్లాలోనే కీలక నేత పెద్ద షాక్ ఇచ్చారు. శ్రీకాళహస్తి మాజీ ఎంఎల్ఏ ఎస్సీవీ నాయుడు టిడిపికి రాజీనామా చేశారు. శ్రీకాళహస్తిలో పోటీ చేయటానికి టికెట్ కోసం నాయడు శతవిధాల ప్రయత్నించారు. అయినా సిట్టింగ్ ఎంఎల్ఏ, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గట్టిగా పట్టుబట్టి తన కొడుకు సుధీర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు.

 

దాంతో  అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలను నాయుడు దూరంగా ఉంటున్నారు. సుధీర్ రెడ్డి ప్రచారానికి ఒక్కరోజు కూడా నాయుడు పాల్గొనలేదు. నాయుడు మద్దుతుగా నిలబడకపోతే టిడిపి అభ్యర్ధి గెలుపు కష్టమే. ఎందుకంటే శ్రీకాళహస్తిలో నాయుడుకు బలమైన వర్గముంది. ఈ నియోజకవర్గంలోనే కాకుండా సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరులో కూడా బలమైన అనుచరగణం ఉన్నారు. అందుకే నాయుడు రాజీనామాతో పార్టీకి పై మూడు నియోజకవర్గాల్లో గట్టి దెబ్బ తగిలే సూచనలు కనబడుతున్నాయి.

 

టిడిపికి రాజీనామా చేసిన నాయుడు వైసిపిలో చేరబోతున్నారు. వైసిపిలో చేరగానే శ్రీకాళహస్తి, సత్యవేడుతో పాటు గూడూరు నియోజకవర్గాల్లోని వైసిపి అభ్యర్ధుల విజయం కోసం గట్టిగా కృషి చేయనున్నారు. జగన్ ను సిఎం చేయటమే ధ్యేయంగా పనిచేస్తానని నాయుడు చెబుతుండటం గమనార్హం. పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ఇంకా ఎంతమంది టిడిపి నేతలు వైసిపిలో చేరటం ఆ పార్టీకి ప్రతికూలమనే అనుకోవాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: