ఆయనది సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. ఇక వంశాల వద్దకు వస్తే శతాబ్దాల కీర్తి కలిగిన విజయనగరం  పూసపాటి సంస్థానాధీశులు. సరిగ్గా 42 ఏళ్ళ క్రితం రాజకీయ అరంగేట్రం చేసి నేటికి కొనసాగుతున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఎంత డక్కా మెక్కీలు తిన్న వారైనా రాజకీయాల్లో చిత్తు కావాల్సిందే. ఓటమి ఎరగని వీరుడు అనిపించుకున అశోక్ గజపతి రాజు 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఘరంగా పరాజయం  పాలయ్యారు. దాంతో ఎంతటి రాజులకైనా ఓటమి తప్పదని రుజువైపోయింది. సరిగ్గా పదిహేనేళ్ళ తరువాత ఇపుడు మళ్ళీ అశోక్ ని అదే భయం వెంటాడుతోంది. గత ఎన్నికలు నల్లేరు మీద బండీఎలా సాగిపోగా ఈసారి మాత్రం రాజు గారికి క్యాట్ వాక్ కాదంటున్నారు. 


విజయనగరం ఎమ్మెల్యే సీటుని అశోక్ తన కుమార్తె అదితి గజపతి రాజుకు ఇప్పించుకున్నారు. అక్కడ నిన్నటి వరకూ ఎమ్మెల్యేగా ఉన్న మీసాల గీతను తప్పించి మరీ తన వారసురాలిని రంగంలోకి దింపడమే పెద్దాయన కొంప ముంచిందని అంటున్నారు. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత ఇపుడు గుర్రు మీదున్నారు. అంతే కాదు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో పట్టున్న బీసీలు, ఇతర నేతలు కూడా రాజా వారి మీద అప్రకటిత యుధ్ధం మొదలెట్టేశారు. మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లలో ఆయన జోక్యం ఎక్కువైందని, అడిగిన వారిని కాకుండా తన వర్గం వారికి టికెట్లు తెచ్చుకున్నారని  పార్టీలో పొగలు సెగలు రేతోంది.


ఒక తప్పుకు మరిన్ని అన్నట్లుగా తన కూతురు గెలుపు కోసం తూర్పు కాపులను మంచి చేసుకునేందుకు కొన్ని టికెట్లలో బలమైన వారిని కాకుండా  తనవారిని పెట్టుకోవడం వల్ల అశోక్ ఎంపీ అభ్యధిత్వానికి కూడా ఎసరు వచ్చేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే చీపురుపల్లిలో మంత్రి కిమిడి మ్రుణాళిని కొడుకు నాగార్జునకు టికెట్ ఇవ్వడం వల్ల వ్యతిరేక వర్గం గట్టిగా ఉంది. గజపతినగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడుని మళ్లీ పోటీకి దించడంతో ఆయన అన్న కొండలరావు పార్టీకి దండం పెట్టేసి తప్పుకున్నారు. నెల్లిమర్ల టికెట్ ఆశించిన వారిని కాదని వ్రుద్ధుడైన పతివాడ నారాయణస్వామినాయుడుకు మళ్ళీ టికెట్ ఇవ్వడమూ అసమ్మతిని రేపుతోంది. ఇలా అన్ని చోట్లా అసంత్రుపులు గుప్పుమనడంతో మళ్ళీ అశోక్ ఎంపీ సీటు గెలుస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి.


ఇక విజయనగరంలో అదితి గజపతిరాజు ప్రచారానికి పార్టీలోని కొన్ని వర్గాలు దూరంగా ఉంటున్నాయి. ఇంకో వైపు ఇక్కడ వైసీపీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి గట్టిగా జనంలో తిరుగుతున్నారు. ఆలాగే వైసీపీ నుంచి ఎంపీ సీటుకు పోటీ పడుతున్న బెల్లాల చంద్రశేఖర్ కి కూడా బీసీలు, కాపుల మద్దతు దండీగా లభిస్తోంది. ఈ పరిణామాలే ఇపుడు రాజావారికి చమటలు పట్టిస్తున్నాయట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారట. మరి ఓ వైపు వైసీపీ గాలి బలంగా ఉండడం, మరో వైపు పార్టీలో అసమ్మతి, కులాల కుంపటి వెరశి మళ్ళీ రాజావారికి అనుకోని షాక్ ఇస్తాయా అన్న డౌట్స్ వస్తున్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: