ప్రజా జీవితంలో ఉన్నా వారికి జనాదరణ చాలా ముఖ్యం. ప్రతి అయిదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఎన్నికలలకు కొత్త ఓటర్లు వస్తారు. ప్రతి పదేళ్ళకు నూతన తరం వస్తుంది. వారి అభిప్రాయాలను పట్టుకుని అనుకూలంగా నడవడం అంటే చాలా కష్టమైన, క్లిష్టమైన విషయం.


అయితే చాలా సార్లు  రాజకీయ పరిస్థితులు కూడా కలసి వచ్చి అప్పటికి ఆయనే గ్రేట్ అని గెలిపించిన సందర్భాలు ఉంటాయి. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు 2019 ఎన్నికలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఆయన ఈసారి గెలవడం చాలా ముఖ్యం. ఓ విధంగా టీడీపీకి కూడా అతి ముఖ్యం. చంద్రబాబు రాజకీయ జీవితం 1978లో మొదలైంది. అప్పట్లో కాంగ్రెస్ దేశంలో రెండు ముక్కలైంది. ఇందిరాగాంధి తన చరిష్మాను నమ్ముకుని ఇందిరా కాంగ్రెస్ అని ఓ పార్టీని కొత్తగా ఏర్పాటు చేశారు. దానికి హస్తం గుర్తు కేటాయించారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో రెడ్డి కాంగ్రెస్ అని సీనియర్ నేతలంతా అందులో చేరిపోయారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ కు అభ్యర్ధులే దొరకలేదు.


ఆ టైంలో చిత్తురు జిల్లా చంద్రగిరి నుంచి నారా చంద్రబాబునాయుడు అనే 28 ఏళ్ళ యువకుడు టికెట్ కొరుతూ దరఖాస్తు  దాఖలు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వమని ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాజగోపాల్నాయుడు సిఫార్స్ చేయడంతో బాబుకు టికెట్ దక్కింది. దేశంలో ఇందిరాగాంధి వేవ్ ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ఆమె పార్టీ గెలిచింది. అలా లక్కీగా బాబు తొలిసారి ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తరువాత ఆయన మంత్రి కూడా అయ్యారు. టీడీపీ ఏర్పాటుతో కాంగ్రెస్ పని అయిపోగా 1983లో ఆ పార్టీలో చేరిన చంద్రబాబు  తన మామ అయిన నందమూరికి రాజకీయ సలహాదారుగా మారి పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు.


ఇక 1995 ఆగస్ట్ లో జరిగిన పార్టీలో వెన్నుపోటు సంఘటనతో బాబు సెప్టెంబర్  1న ముఖ్యమంత్రి అయిపోయారు. 1999 నాటికి బీజేపీ, వాజ్ పేయ్ గాలి లో మరో మారు సీఎం అయ్యారు. 2004 నాటికి ఆయన పప్పులు ఉడకలేదు. వైఎస్సార్ రూపంలో ఆయన్ని పెద్ద ప్రమాదం ముంచేసింది. బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009 లోనూ మళ్ళీ బాబు ఓడిపోయారు. 2014 నాటికి రాష్ట్ర విభజన కలసి వచ్చింది. అలాగే మోడీ, పవన్ తోడు కూడా బాబును గట్టెక్కించాయి. ఇపుడు కీలక దశకు బాబు చేరుకున్నారు.


పదెహేనేళ్ళ క్రితం తండ్రి చేతిలో ఓడిపోయిన బాబుకు ఈసారి కొడుకు జగన్ చేతిలో పరాభవం తప్పదని అన్ని సర్వేలూ గట్టిగా చెబుతున్నాయి. జనం నాడి కూడా అలాగే ఉంది.   ఇక  ప్రముఖ జాతీయ పత్రిక ఎకనామిక్ టైమ్స్ ఏపీ ఎన్నికలపై రాసిన ఓ కధనం ఇపుడు సంచలం రేకెత్తిస్తోంది. ఈ కధనం ఎన్నో విషయాలను ప్రస్తావించింది. బాబు రాజకీయ జీవితం మరి కొద్ది రోజుల్లో ముగుస్తోందని కూడా చెప్పుకొచ్చింది. దానికి పునాది ఏప్రిల్ 11న పడితే మే 23న ఫలితాల తరువాత బాబు పదవీ విరమణ చేయాల్సిందేనని కూడా గట్టిగా చెప్పేసింది.


ఇందుకు బాబు చేసిన అనేక తప్పిదాలే కారణమని కూడా ఆ పత్రికా కధనం తేల్చేసింది. జగన్ ప్రభజనం ఏపీని వూపేస్తోందని, అది 2004 కంటే కూడా ఎక్కువగా  ఉందని, ఏపీలో పవన్, బాబు రహస్య బంధం కూడా జనాలకు తెలిసిపోయిందని, ఫలితంగా ఈ ఇద్దరికీ కోలుకోలేని విధంగా ఫలితాలు ఉంటాయని కూడా రాసుకొచ్చింది. మొత్తానికి ఈ కధనమే నిజం ఐతే మాత్రం సరిగ్గా నాలుగు దశాబ్దాల తరువాత బాబు రాజకీయ జీవితం క్లోజ్ ఐపోయినట్లే. 
ఎందుకంటే ఈసారి ఓడిపోతే బాబు వయోభారం రిత్యా మళ్ళీ పార్టీని నడిపించలేరన్న భావన కూడా ఉంది. మరో వైపు ఒక్కసారి అధికారం దక్కితే జగన్ మరిన్ని టెర్మ్ లు పాలించేందుకు దాన్ని ఉపయోగించుకుంటారని కూడా అంచనాలు ఉన్నాయి. సో బాబు రిటైర్మెంట్ కధనం ఇపుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: