తెలంగాణా శాసనసభ ఎన్నికల సమయంలో లగడపాటి రాజగోపాల్తో తప్పుడు సర్వే చేయించి ప్రకటించిన ఒక వర్గం మీడియా వారి విశ్వసనీయతను పూర్తిగా కోల్పోగా – ఆ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగపాల్ మొత్తం తెలుగు సమాజంలోనే జోకింగ్ స్టాక్ గా నిలిచిపోయారు. మామూలు పరిస్థితులలో ఎలా ఉన్నా, ఎన్నికల ముంగిట్లో మీడియా సంస్థలు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 
chandrababu vs jagan కోసం చిత్ర ఫలితం
తాజా పరిస్థితుల్లో ఏది నిజం?  ఏది అబద్ధం? అన్న విషయాన్ని గుర్తించటం కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఇలాంటి వేళ ఆచితూచి అడుగులు వేయాలే కానీ తొందర పడితే ఎదురుదెబ్బ తగిలి తలబొప్పి కట్టటం ఖాయం.


తాజాగా ఒక మీడియా సంస్థ - ఆంధ్రజ్యోతి సంస్థ బహుశ లీగల్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా ఎదుర్కోవలసి రావచ్చని అంటున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. 


తాజాగా ఎబీపీ చానల్ కోసం లోక్ నీతి సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సర్వేను నిర్వహించి నట్లుగా పేర్కొన్న ఆ మీడియా సంస్థ, ఒక భారీకథనాన్ని అచ్చేసింది. ఈ కథనంలో టీడీపీకి భారీగా సీట్లు వస్తాయన్న అంచనాను వ్యక్తం చేయటమే కాదు.. వైసిపికి 50 సీట్లకు మించి రావన్నట్లుగా కథనం రాసింది. ఈ రోజు పత్రికలో ప్రచురితమైన ఈ కథనాన్ని తాజాగా “సీఎస్ ఈఎస్-లోక్ నీతి సర్వే సంస్థ” తప్పు పట్టింది. 



“ట్విట్టర్ ఖాతాలో తాము ఎలాంటి సర్వేను ఏపిలో నిర్వహించలేదు” అని స్పష్టం చేసింది. అంతే కాదు అసలు వారి వెబ్ సైట్ లోనూ వారు చేసినట్లుగా చెప్పే సర్వే పూర్తి అవాస్తవం అని, అదంతా అబద్ధమని పేర్కొంది. తమకు సంబంధం లేని సర్వేను, తమ సంస్థ పేరుతో ప్రింత్ చేసిన వార్తపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు, చట్టబద్ధం గా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. తాజా పరిణామం ఒక విధంగా అన్ని మీడియా సంస్థలకు ఒక చెంపపెట్టు హెచ్చరిక లాంటిది.


ఇప్పుడున్న సమాచార విప్లవంలో ఏది నిజం?  మరేది అబద్ధమన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. లేదంటే, ఇబ్బందికర పరిస్థితి ఎదురుకాక తప్పదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, “ఫేక్ న్యూస్” ను గుర్తించే విషయంలో దొర్లిన తప్పు తోనే ఈ వార్త ప్రచురిత మై నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆ మీడియా సంస్థలో అంతర్గత విచారణ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?  ఎక్కడ తప్పు దొర్లింది?  దీనికి కారణం ఏవరు?  అన్న విషయాల మీద ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: