ఆ మద్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై పోటీగా కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడింది.  అయితే ఎన్ని జిమ్మిక్కులు చేసినప్పటికీ ఇక్కడ ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం కట్టారు.  రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నుకోబడ్డారు.  అయితే టీఆర్ఎస్ కి ముందు నుంచి మజ్లీస్ నేతలు అసదుద్దీన్ ఓవైసీ సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే.  

తాజాగా ప్రధాని పదవికి అర్హుల జాబితాను రూపొందిస్తే అందులో కేసీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.  జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరానికి తీసుకు రావడానికి టీఆర్ఎస్ అధినేతన, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అసదుద్దీన్  మీడియాతో మాట్లాడుతూ, మోదీ, రాహుల్, కేసీఆర్ ముగ్గురిలో ప్రధాని పదవికి ఒకరిని ఎన్నుకోమంటే తాను కేసీఆర్‌ను ఎన్నుకుంటానని తెలిపారు.

ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీలే అధికారాన్ని చేపడతాయన్న కేసీఆర్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.  కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివి..వాటితో దేశానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకున్న నేతగా కేసీఆర్‌ను అభివర్ణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: