నొప్పించక-తానొప్పక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతీ..అని శతాకకారుడు బద్దెన గారు చెప్పిన ఈ జీవన సూత్రం మహాచక్కగా అన్వయించుకుని ఇందిరాగాంధీ ఎమర్జేసీ సమయము నాటి అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన బాబు దాదాపు నాలుగు దశాబ్దాలు ఎవ్వరినీ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేకుండా  అంచెలంచెలుగా ఎదుగుతూ పైకొచ్చారు. 


ఆల్కాహాలే కాదు..కాఫీ - టీ అలవాట్లు కూడా లేవంటారు చంద్రబాబు నాయుడికి.  మాట్లాడే విధానంలో, మనుష్యులతో వ్యవహరించే విధానంలో కూడా తనదైన శైలి బాబు కి సొంతం. 


అయితే ఇది అంతా గతం.. నేడు మనం చూస్తున్న చంద్రబాబు అస్సలు చంద్రబాబేనా అన్నట్లుంది..బాబు ప్రవర్తన ఈ మద్య 2019 ఎన్నికల ప్రచారంలో ఎందుకిలా మాట్లడుతున్నాడు.? హావ-భావాలు, మితిమీరిన మాటలు, ‘సన్ ’స్ట్రోక్ ఏమో తగలలేదు కదా..అని అంటున్నారు ఆంధ్రప్రజ.


ఖబర్థార్ అని  అంటున్నారు..పిల్లల కిడ్నాపంటారు, బజార్లో హత్యలంటారు... డబ్బు దోచుకుంటారంటారు., తిండిలో విషయం అంటారు, లోయలో దూకటమంటారు..40 ఏళ్ల రాజకీయ నాయకుడిలా కాదు, ఓడిపోయిన రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని అంటున్నారు ఆంధ్రప్రజ. 

మరింత సమాచారం తెలుసుకోండి: