ఏపిలో ఇప్పుడు ఎన్నికల ప్రచారాలు జోరందుకున్న విషయం తెలిసిందే.  మొన్నటి వరకు ఒక పార్టీకి జై కొట్టిన వారు..ఇప్పుడు వేరే పార్టీకి జై కొడుతున్నారు.  ఏ క్షణంలో ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారో..ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.  ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన మద్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది.  అయితే టీడీపీకి ఈ మద్య చాలా మంది  మీద షాక్ ఇస్తున్నారు.  తాజాగా ఆళ్లగడ్డ ప్రాంతంలో పేరున్న నేత, ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, ఆ పార్టీకి షాకిస్తూ, వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికారు.   

ఆ మద్య నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన గంగుల నిన్నటి వరకు టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు.  కానీ, మంగళవారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి (నాని)కి మద్దతిస్తున్నట్టు ప్రతాప్ రెడ్డి కుటుంబం స్పష్టం చేసింది. ఆళ్ల గడ్డలో ఇప్పుడు ఎన్నికల పుణ్యమా అని మరోసారి విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. గంగుల ఫ్యామిలీ ఏకం కావడంతో టీడీపీకి, ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్న భూమా అఖిలప్రియకు షాక్ తగిలినట్లయింది.


ఈ సందర్బంగా గంగుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబు తనను సహాయం కోరారని..అందుకే ఆ సమయంలో తాను ప్రచారం చేశారని అన్నారు. ఇదే సమయంలో నంద్యాల పార్లమెంట్ కు మీరే సరైన అభ్యర్థి చెప్పారు..కానీ ఇచ్చిన మాట ఆయన నిలుపుకోలేదు.  ప్రజాబలాన్ని పక్కనబెట్టి, ధనబలం ఉన్నవారిని ఎంపిక చేశారని అన్నారు. బిజేంద్రను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: