ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. టీడీపీ, వైసీపీలకు ఎవరి సొంత మీడియా హౌజులు వారిక ఉన్నాయి. కాకపోతే వైసీపీ ఈ విషయంలో కాస్త వెనుకబాటే అనిచెప్పాలి. ఒక్క సాక్షి మీడియా తప్ప మిగిలిన వాటి నుంచి అంత సపోర్ట్ లేదు. 


కానీ చంద్రబాబుకు మాత్రం ఎల్లో మీడియా దన్ను గట్టిగా ఉన్న సంగతి అందిరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మీడియా అధిపతులు మీడియా వ్యవహారాలే కాకుండా.. మీడియేటర్ పాత్ర కూడా పోషిస్తున్నారట. అంటే పార్టీల అధినేతలకు రాయబారం అన్నమాట. 

ఇటీవలి కాలంలో జనసేన, టీడీపీ మధ్య సత్సంబంధాలే కనిపిస్తున్నాయి. జనసేన అధికారపార్టీ టీడీపీని వదిలేసి.. వైసీపీపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఇది టీడీపీ- జనసేన మధ్య అవగాహన ప్రకారమేనని.. ఇందుకు ఓ మీడియా సంస్థ అధిపతి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడని మీడియా సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. 

ఇలా రాయబారం చేసినందుకు ఆ మీడియా సంస్థ అధిపతికి కూడా భారీగానే నజరానాలు ముట్టునట్టు సమాచారం. సో.. తమ పత్రికల్లో పేజీలకు పేజీలు టీడీపీ అనుకూలంగా రాయడమే కాకుండా.. ఇలా మీడియేటర్ పాత్ర ద్వారా కూడా తమ వంతు సాయం అందిస్తోందన్నమాట సదరు మీడియా. 



మరింత సమాచారం తెలుసుకోండి: