తెలుగుదేశంపార్టీ సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ పై తెలంగాణా పోలీసులు కేసు నమోదు చేశారు.  ఏపి ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకని హైదరాబాద్ నుండి రాజమండ్రి నుండి డబ్బులు తీసుకెళుతున్నపుడు కొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. జయభేరి సంస్ధ మేనేజర్ తో పాటు మరో ఐదుగురు సిబ్బందిని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.

 

ఆ కేసుకు సంబంధించే సైబరాబాద్ పోలీసులు మురళీమోహన్ పైన కూడా కేసు నమోదు చేశారు. రాజమండ్రి ఎంపి ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి సుమారు రూ .2 కోట్లు తీసుకెళ్ళేందుకు జయభేరి సంస్ధ మేనేజన్ ప్లాన్ చేశారు. రాజమండ్రి లోక్ సభ లో మురళీ మోహన్ కోడలు మాగంటి రూప టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

పట్టుబడిన జయభేరి సిబ్బందిని విచారించగా డబ్బులు తీసుకెళుతున్నది ఎవరి కోసం, ఎక్కడికి అనే విషయాలను చెప్పేశారట. దాంతో వారిచ్చిన సమాచారం మేరకు ఎంపి మురళీమోహన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎంపి పరారీలో ఉన్నట్లుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసుకున్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఓ ఎంపిపై కేసు నమోదు కావటం బహుశా ఇదే మొదటిసారేమో ? ఎంపిపై కేసు నమోదైన విషయం తెలియగానే టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: