జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశారు. తాను కింగ్ మేకర్ కాదని, కింగ్‌నని స్పష్టంచేశారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల తరువాత ఏపీలో బీఎస్పీ-జనసేన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమావ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా తామే గెలుస్తామని స్పష్టంచేశారు.


ఎవరికో మద్దతు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని, ఏదైనా నిర్భయంగా, సగౌరవంగా చేస్తానని పవన్ అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ కి చంద్రబాబు గారి అనుభవాన్ని చూసి మద్దతు ఇచ్చానని ఆయన అన్నారు.అవినీతిని రూపుమాపడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో కూడా టీడీపీ పై అసమ్మతి పెరిగిపోయిందని విమర్శించారు జనసేనాని. ప్రజలు ప్రాంతాలుగా విడిపోవడం దేశ సమగ్రతకు మంచిది కాదన్నారు.


అలాగే ఆంధ్రకు ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైంది అని, ముందు ప్యాకేజ్ అని చెప్పి ఎన్నికల ముందు హోదా కావాలంటూ కొత్త నాటకానికి తెరలేపారు అంటూ మండిపడ్డారు.అంతకముందు తాను తెలంగాణ పై చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఐతే తెలంగాణ, ఏపీ నేతల మధ్య గొడవలు తప్ప ప్రజల మధ్య అలాంటివి లేవని చెప్పారు పవన్. అత్యధిక మెజారిటీ తో ఎన్నికల్లో గెలుపొందడం ఖాయమని పవన్ ధీమాగా ఉన్నారని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: