చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని ఎవరూ తక్కువ వేయకూడదు. ఆయన ప్రణాళికలు అన్నీ  పక్కాగా ఉంటాయి. అందుకే ఆయన ఒకే ఒక్కడుగా ప్రస్తుత ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఏపీలో అయిదేళ్ల పాలన తరువాత కూడా, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో కూడా మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందేమోనని కొంతైనా ప్రచారం సాగుతోందంటే దానికి బాబు మార్క్ స్ట్రాటజీ కారణం.


బాబు చేసిన తెలివైన పని ఇపుడు ఎన్నికల వేళ అవసరం తీరుస్తుందా అన్న చర్చ రాజ‌కీయ వర్గాలలో వాడిగా వేడిగా సాగుతోంది. ఇపుడు పసుపు కుంకుమ మూడవ విడత మొత్తాలు బ్యాకులల్లో జోరుగా  క్రెడిట్ అవుతున్నయి. దీని మీద ఎన్నికల సంఘం కూడా పచ్చ జెండా వూపడం బాబు పార్టీకి కొత్త వూపిరి ఇచ్చినట్లే. సరిగ్గా ఎన్నికలు నాలుగు రోజుల్లో ఉన్నాయనగా టైం చూసి మరీ బ్యాంకుల్లో వేస్తున్న నగదు డ్వాక్రా మహిళల ఆలొచననలు ఎంత మేరకు ప్రభావితం చెస్తుందన్నది పెద్ద చర్చగా ఉంది.


దీని మీద ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పడంలేదు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ఎన్నికల కోడ్ రాక ముందే చంద్రబాబు తెలివిగా పోస్ట్ డేటెడ్ చెక్కులను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. దాంతో ఆనాడు కోడ్ లేనందున ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదిక్కడ. దాంతో ఒక్కసారిగా  ఇపుడు ఏపీలో 97 లక్షల డ్వాక్రా మహిళల ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు జమ అవుతోంది.
 ఓ విధంగా చూస్తే ఎన్నికల ముందు ఇలాంటివి తాయిలాల కిందకే వస్తాయి. అదీ ప్రభుత్వ సొమ్మును కరెక్ట్ టైంలో వారి ఖాతాల్లో వేయడం ఆ ఆనందం అవిరి కాక ముందే పోలింగ్ ఉండడంతో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు.  ఇది టీడీపీకి ఎంతవరకూ  ప్లస్ అవుతుందన్నది కూడా ఆలోచనగా ఉంది.


ఇక రైతు బంధు తరహాలో రైతులకు కూడా మరో విడత నగదు మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు. ఇది కూడా కోడ్ కి ముందు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈసీ ఏమీ చేయలేదన్నది వాసవం. రేపో మాపో ఆ మొత్తాలు కూడా పడుతున్నాయి. నిజానికి ఏప్రిల్ చివరల్లో ఎన్నికలు వస్తాయని బాబు సర్కార్ అప్పట్లో ఏప్రిల్ మొదటి వారానికి ఈ స్కీములు అందేలా షెడ్యూల్  చేసింది. ఐతే ఇపుడు సరిగ్గా ఎన్నికలు నాలుగు రోజుల ముందే రావడంతో టీడీపీకి గరిష్టంగా లాభం ఉంటుందని కొందరు అంటున్నారు. ఏపీలో 97 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అలాగే యాభై లక్షల మంది రైతులు ఉన్నారు. మరి  బాబు స్ట్రాటజీ నిజంగా వర్కౌట్ అవుతుందో లేదో ప్రజా తీర్పు లో తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: