మనకందరికీ బీకాంలో ఫిజిక్స్ చదివారు జలీల్ ఖాన్ గుర్తే ఉండి ఉంటాడు. అతని వీడియో ఎలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కేవలం ఫిజిక్స్ మాత్రమే చదివారు. అదే పవన్ కల్యాణ్ అయితే ఒక్క ఇంటర్మీడియట్ లోనే ఏకంగా 3 గ్రూపులు చదివారు. రెండేళ్ల ఇంటర్మీడియట్ లో ఏకంగా సిఈసీ, ఎమ్ఈసీ, ఎంపీసీ కలిపి చదివేశారు జనసేనాని.

వివిధ సందర్భాల్లో తన విద్యార్హతల గురించి మాట్లాడుతూ, ఒక్కో సందర్భంలో ఒక్కో గ్రూపు చెప్పారు పవన్. అలా చెప్పిన 3 క్లిప్పింగ్స్ కలిసున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా పవన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. ఓ సందర్భంలో తను నెల్లూరు వీఆర్ కాలేజీలో సిఈసీ చదివానని చెప్పుకున్నారు పవన్. మరో సందర్భంలో పదో తరగతి మార్కులు తక్కువగా వచ్చాయి కాబట్టి ఎమ్ఈసీలో సీటు ఇచ్చారని చెప్పారు.

ఇక మూడో సందర్భంలో వినయ్ బాబు దగ్గర ట్యూషన్ కు వెళ్తూ, ఎంపీసీ చదివానని చెప్పారు. ఇలా రెండేళ్ల ఇంటర్మీడియట్ లో పవన్ 3 గ్రూపులు కలిపి చదివినట్టయింది. మొన్నటివరకు పవన్ విద్యార్హతలేంటనేది ఎవరికీ తెలియదు. కొంతమంది అతడ్ని "టెన్త్ పాస్" అంటూ విమర్శిస్తారు. మరికొందరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటారు. తాజాగా నామినేషన్ సందర్భంగా పవన్ తన విద్యార్హతల్ని అందులో వెల్లడించారు. తను ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు స్పష్టంచేశారాయన. పవన్ ఇంటర్మీడియట్ పాసైంది నిజమే. కానీ ఆయన ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చదివారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: