ఏపీలో ఇపుడు హోరా హోరీ పోరు సాగుతోంది. యువనేత జగన్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. రోజుకు నాలుగు సభలు, మూడు జిల్లాలకు తక్కువ కాకుండా తిరుగుతున్నారు. ఏపీని ఆయన చుట్టేస్తున్నారు. గత ఇరవై రోజులుగా జగన్ చాలా తీవ్రంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

 

ఈసారి కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని జగన్ ఢంకా భజాయించి చెబుతున్నారు. దానికి ఆయన చెప్పిన లెక్కలు అంచనాలు ఇలా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పోటా పోటీ పోరు సాగినపుడే కేవలం 1 శాతం కంటే తక్కువ ఓట్లతో వైసీపీ ఓడిపోయింది. అపుడు నరేంద్ర మోడీ గాలి. పవన్ సినీ గ్లామర్ చంద్రబాబుకు  అండగా ఉన్నాయి. పైగా బాబు నాడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ సానుభూతి కూడా అయనకు కలసివచ్చింది. ఈసారి ఆ బంధాలన్నీ చెదిరిపోగా బాబు కు అన్నీ ప్రతికూల అంశాలుగా మారాయి అని జగన్ చెప్పుకొచ్చారు.

 

తాను చేసిన పాదయాత్రలో ప్రభుత్వంపైన ఉన్న అసంత్రుప్తి తీవ్రతను కళ్ళారా చూశానని జగన్ అంటున్నారు. ఈసారి ఎలాగైనా బాబుని గద్దె దింపేందుకు జనం సిధ్ధంగా ఉన్నట్లుగా మొత్తం వాతావరణం ఉందని జగన్ క్లారిటీగా చెప్పారు. ఆరు నూరు అయినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ ధీమాగా చెప్పారు. ఓ జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తన భావాలను ఇలా పంచుకున్నారు. ఆరు వందల హామీలు ఇచ్చిన వాటిని పక్కన పెట్టిన బాబుని ఏపీలో మళ్ళీ ఎన్నుకునేందుకు జగన్ సిధ్ధంగా లేరని జగన్ ఖరాఖండీగా చెప్పేశారు. మెమొచ్చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: