2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర సర్వాధికారం పువ్వుల్లోపెట్టి మరీ మీకందించారు. మీ అనుభవశీలతకు ఓటువేసి, మిమ్మల్ని మీ పార్టీని పూర్తిగా నమ్మి ప్రజలు మీ కిచ్చిన అధికారాన్ని వమ్ము చేస్తూ మీరు పాలించిన ప్రవర్తించిన తీరు జన హృదయాలను కలచివేసింది. రికాల్ అధికారం ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం యివ్వక పోవటం వల్ల మీరి ఐదేళ్ళూ నిర్విరామం గా రాష్ట్రాన్ని పాలించారు అనే కంటే రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేసారు. 


*ఉభయ రాష్ట్రాలకు పదేళ్ళపాటు కొనసాగించాల్సిన రాజధానిని "ఓటుకు నోటు కేసు" ద్వారా మీ ప్రత్యర్ధి చేతికి చిక్కి ఆ ప్రయోజనాన్ని మీ స్వార్ధం కోసం బలిచేశారు. లేకుంటే ఈ ప్రయోజనం మరో దశాబ్ధం కొనసాగి కొనసాగి ఉన్నా ఆశ్చర్యం ఉండేది కాదు. అలాంటి ప్రయోజనం వినియోగించుకొని అమరావతి విశ్వనగర నిర్మాణం ఒక క్రమ పద్దతిలో పూర్తిచేసుకొనే అవకాశానికి పురిట్లోనే సంధి కొట్టించారు. ఇది లక్షల కోట్ల కనిపించని ప్రయోజనం నీళ్ళపాలు చేసిన మీరు కోటాను కోట్ల రూపాయలను తాత్కాలిక నిర్మాణాలకు లెక్కా పత్రం లేకుండా వెచ్చించి జన ఆశలపై నీళ్లు చల్లారు.


*ప్రత్యేక హోదా గాలికి వదిలేసి కమీషణ్ల కక్కుర్తితో ప్రత్యేక ప్యాకేజి వెంటపడి ఆ సందర్భంగా దాన్ని వ్యతిరేఖించిన అనేకమందిని నిర్ధాక్షిణ్యంగా పోలీసులు కొట్టి జైళ్ళలో కుక్కి నానావిధ హింసలకు గురిచేశారు. అసలు ప్రజామోదం లేని ప్రత్యేక పాకేజీని బలవంతంగా ఒప్పించారు. అంతేకాదు ఆ ప్రయోజనం అందించినందుకు గాని కేంద్ర నాయకత్వానికి శాసనసభ లోపల వెలుపల పలు వేదికలపై సన్మాన సత్కారాలు చేశారు. ప్రజలు కోరని ప్యాకేజిని అందలం ఎక్కించిన మీ తీరు గర్హనీయం మీ అనుభవాన్ని మీ స్వార్ధప్రయోజనాలకు వాడేసుకొన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం వినియోగించలేదు.


*మీరు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో అమరావతి ప్రాంతమంతా కాల్-మని లాంటి దురాగతాలు దుశ్చర్యలతో చెలరేగిపోగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు నాడు మహిళలపై చేసిన లైంగిక అత్యాచారాలు జాతి ఏనాటికి మరచిపోలేదు.


*అమరావతి లాంటి ముక్కారు పంటలు పండే వ్యవసాయ భూములను బలవంతంగా రైతుల నుండి గుంజేసుకొని సేకరించి నట్లు నమ్మించి కాంక్రీట్ కీకారణ్యాన్ని నిర్మించ తలపెట్టిన మీ ప్రయత్నం ప్రకృతి సమ్మతం కాదు. పంటలు పండని ఎంతో భూమి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అలాంటి మెట్ట మెరక నేలపై రాజధానిని నిర్మిస్తే పంటలు పండే ఈ నేల సేధ్యానికి ఉపయోగపడి ఉండేది. అయితే రాష్ట్ర రాజకీయ ఆర్ధిక ఆధిపత్యం మొత్తం మీ సామాజిక వర్గ గుప్పిట్లో పెట్టటం మీ ధ్యేయమన్నది ప్రజలు అర్ధం చేసుకొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మీ స్వంతాని సంపద సృష్టించుకోవటమే మీ ఆంతర్యమని జనం అర్ధం చేసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  


*అమరావతి నగరాన్ని అవినీతి, బందుప్రీతి, కుల, మత సామాజిక వర్గ మాఫియాల పునాదులపై నిర్మించటం మొదలు పెట్టారు. ఆ మాఫియాలకు కేంద్ర స్థానం కూడా అమరావతే. మీ సామాజిక వర్గ ఆధిపత్యం ఉన్న అమరావతిలో ఆ స్థానబలం వాడేసుకుని - ఇసుక ఖనిజ కల్తీ విద్య వైద్య ఆరోగ్య కాల్-మనీ సెక్స్ కాంట్రాక్టర్లు మొదలైన ప్రాధాన్య రంగాల్లో మీ పరిజనుల ఆధిపత్యం లోనే మాఫియా సామ్రాజ్యాలు విశ్వనగరం కంటే ముందే వేళ్ళూనుకునే చేశారు. ఈ విషయంలో మీ చరిత్రహీనత విశ్వవ్యాపితం కాకతప్పదు. ఇందులో మీ స్వయం పాత్ర ఉన్నా లేకున్నా మీ సామాజికవర్గ జనాల ప్రధాన పాత్ర ఉందనేది నగ్న సత్యం.


*రాజధాని అంటే సర్వసమ్మతంగా నివాసయోగ్యంగా ఉండాని కాని ఒక సామాజికవర్గమే విలాస వంతంగా బ్రతికేలా, లేక కొన్ని ఇతర విలాసవంతమైన కులాలకు మాత్రమే అందుబాటులో ఉండేలా ఉన్న ఆ నగరంలో సాధారణ సఖల జనులు జీవించటం దుర్లభం కాదా! కనీసం కామేతర సామాజిక వర్గా నికి కిరాయికి ఇళ్ళు కూడా దొరకని ఆ నగరం సాధారణ జనానికి అంద నంత దూరంలో ఉంది.


*మీరే నరేంద్ర మోదీ సారధ్యం లోని బిజెపి తో, - పవన్ కళ్యాన్ నేతృత్వం లోని జనసేన తో, మీ నాయకత్వం లోని టిడిపిని ఒక జట్టుకట్టారు. దాన్ని ప్రజలు కోరుకోలేదు. కాని మీ నాలుగు సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ అనుభవానికి ఓటేసి మీ సంకీర్ణానికి మద్దతిచ్చి గెలిపించారు. అంటే ప్రజలు తమకు ఇష్టం ఉన్నా లేకున్నా మిమ్మల్ని సమర్ధిన్ చారు ఎందుకంటే మీరు ఎవరి నుంచైతే విభ విభజన ఫలాలను సాధించాలో వాటిని సాధించిపెట్టి రాజధాని లేని రాష్ట్రానికి సౌభాగ్యాన్ని అందిస్తారనుకున్నారు ఆశించారు. అలాగే తెలుగుప్రజల ఆరాధ్య సినీ కథానాయకుడు చేసిన వాగ్ధానం, మీతో, కేంద్రంతో మీరిచ్చిన వాగ్ధానాలను రాబట్టేలా చూస్తానని అలాజరగని పక్షంలో మీరిరువురిని ప్రశ్నిస్తానని చెప్పారు. ఆయనకు కేంద్రాన్ని మిమ్మల్ని ప్రశ్నించే సామర్ధ్యంగాని ఙ్జానంగాని ఉన్నట్లు లేదు. తరవాత ఆయన కూరలో కరేపాకు మాదిరిగా మారి పోయారు. కాకపోతే ఏ పాలనాధినారం లేని ప్రతిపక్షాన్ని, దాని నాయకుణ్ణి విమర్శిస్తూ రాష్ట్రానికి సేవ చేస్తున్న భ్రమలో జీవించేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు ప్రత్యక్షంగా వదిలేసి పరోక్ష రాజకీయాలకు పరోక్షంగా తెరలేపారు.


*ఇకపోతే కేంద్రంతో నాలుగేళ్ళ పాటు జరిగిన మీ స్నేహం సామరస్యం ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చల్లారనివ్వ కుండా ఆజ్యం పోసుకొంటూ వచ్చిన ప్రతిపక్ష వ్యూహం దెబ్బకు చావు తప్పి కన్ను లొట్టపోయిన వేళ మీ సంకీర్ణం ఎన్డీఏ కు ఒక్కసారిగా రాం...రాం చెప్పటం అందరికి అర్ధమైన విషయమే. ఆ తరవాత బిజేపి స్నేహంలో, మీ స్వప్రయోజనాల ను సాధించుకున్న తరవాత "ప్రత్యేక హోదా" మళ్ళీ తేరపైకి తెచారు. అక్కడ మీరు చేసిన కుళ్ళు కుటిల కుతంత్ర రాజకీయం వివరించాలంటే ఒక పది గ్రంధాల రచన చేయవచ్చు. బెడిసి కొట్టిన బిజెపితో మీ స్నేహం-అక్కడే యూ-టర్న్ తీసుకొని మీకు "యూ-టర్న్ బాబు" అనే సహజనామం మన సమాజమే కాదు ఆసేతు శీతాచలం మిమ్మల్ని కీర్తించింది.


*అధికారం నిలుపుకోవటానికి చేసిన మీరు దుర్మార్గం ప్రతిపక్ష శాసనసభ్యులను నయాన్నో భయాన్నో వేదించి వెంపర్లాడి మీ పార్టీలోకి తెచ్చుకున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ప్రేమికులెవరూ హర్షించరు.  శాసనసభా కాలంలో ప్రతిపక్షనేతను మీరు నిందించిన తీరు ఆక్షెపణీయం. ప్రజలు మీలానే ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారు. ప్రతిపక్షం శాసనసభలో ఉండటం ప్రజాస్వామ్య ప్రాధమిక లక్షణం. శాసనసభ నిర్వహించిన మీ సభాపతి వ్యవహరించిన తీరు జాతికే కళంకం. ఆయన్ని గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది.


*మహిళా సాధికారత అంటే మీ దృష్టిలో మీ కోడలు, మీ శ్రీమతి, మీ పార్టీ మహిళా శాసనసభ్యులు మాత్రమే. ప్రతిపక్షంలోని మహిళా శాసనసభ్యురాల్ని మీరు మీ పోలీస్ వ్యవస్థ వేదించిన తీరు అత్యంత గర్హనీయం. ఇది చాలు మీ పాలనలో మహిళల దుస్థితి వర్ణించటానికి. 


*ప్రతిపక్ష నేత నేరాభియోగాలున్న వారే కావచ్చు! ఆయన్ని ఆయన నేరాలు అభియోగాలు తెలిసిన ప్రజలు దేశంలోని రికార్డ్ స్థాయిలో ఓట్లేసి ఎన్నుకొని మీరు మీ శాసనసభలో "కాబినెట్ రాంక్ స్థాయి" కలిపించే పరిస్థితిని కలిపించారు. ప్రతి సారి ఆయన నేరాలు అభియోగాల ప్రస్థానం తీసుకు వచ్చి సభను చేపల మార్కెట్ చేసిన మీ తీరు ఐదుకోట్ల ఆంధ్రులకు తెలుసు. అందుకే మీరు ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హైదరాబాద్ వదలి అర్ధరాత్రి అమరావతి పారిపోయినట్లే, మీ విద్వేషాన్ని సహించలేక ప్రతిపక్షనేత శాసనసభ వదలి జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయారు. రెండేళ్లకుపైగా మీరు సభా నియమావళి వదిలేని ప్రతిపక్షనేత పట్ల మీరు మీ గుంపు క్రౌర్యాన్ని భరించి దాదాపు రెండేళ్ళు ప్రజావాసం చేసిన తీరు అభినందనీయమే. కనీసం ఆయన జనంతోనే జనంలోనె ఉన్నారు. బహుశ ఆయన పొడగిట్టని మీరు ఆయన సభ నుండి పారిపోయారనుకోవచ్చు కాని ప్రజలనుండే మళ్ళా కెరటంలా మీపై మీ పాలనపై విరుచుకుపడటం అనేది సత్యదూరం కాదు. ప్రతిపక్ష నేత నీతిమంతుడనటం లేదు మీరే ఆయన్ని మీ తీరుతో ఆయన్ని అధికారంలోకి తెస్తున్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయం లేని పరిస్థితి.


*పవన్ కళ్యాన్ జవరాలు కాదు కాని, ఆయన తీరు "క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్.." అన్నట్లుంటుంది. యువకుడై ఉండి జనంలో కూలిపోయారు. "ఏ సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ" అంటారు కాని అదే ఆయనకు ఉన్నట్లు లేదు. ఆయన ఎందుకూ పనికి రారని ప్రజలకు తేలిపోయింది. ప్రశ్నిస్తానని ఐదేళ్ళు ప్రశ్నించ లేదు. ఎండలను తట్టుకొని భావస్పోరకంగా ప్రసంగించలేరు. రాగ్ధాంతం తప్ప ఒక సిద్ధాంతమూ లేదు. ఆయన ఈ ఐదేళ్లలో ప్రజలకు చేయబోయే మేలేమితో ఇప్పటికైనా అర్ధకాలేదు. అందుకే వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమే మానసికంగా శారీరకంగా రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా (ఇది ఈ కాలానికి అవసరమని మీరే చెప్పారు) బలవంతుడు ప్రత్యామ్నాయంగా జనంలో కనిపిస్తున్నారు.


*ఇక పోలవరం విషయానికొస్తే దాని నిర్మాణం పూర్తి కావలసిన సమయం మీరే నిర్ణయించారు 2018 అని. మీరు నిర్దేశించు కున్న మీ ప్రణాళికను మీరే నిర్వహించుకొని విజయం సాధించాలి. వైఫల్యాలకు చాలా కారణాలు చూపొచ్చు. "ఫైల్యూర్ ఈజ్ యాన్ ఆర్ఫాన్, బట్ సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్" అంటారు "విజయాలు అన్ని మీ ఖాతాలో వేసుకొని అపజయాలు మాత్రం 'జగన్-కేసీఆర్-మోడీ' ఖాతాలో వేయటం చూస్తూనే ఉన్నాం మీ "అవకాశవాదం" పోలవరం నిర్మాణ బాధ్యత మీది కాదు కాని మీరు తీసుకున్నారు. లేకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రం బాధ్యత తీసుకోవలసి వచ్చేది. కాని అలాంటి అవకాశం మీరే వారికిచ్చారు. కేంద్రం ఇచ్చే సహాకారం ప్రజలకు అవసరం లేదు పని పూర్తవటమే మాకు ముఖ్యం. అలా వాళ్ళను ప్రశ్నించాలంటే "ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్" కూడా మీరే యివ్వాలి దానిని విస్మరించటం మీ తప్పిదం. ఆర్ధిక సహాకారం అందించిన సంస్థ దానిని ఎలా వినియోగించారో తెలుసుకోవటం వారికి అవసరమాత్రమే కాదు నైతిక బాధ్యత అకౌంటింగ్ ప్రిన్సిపుల్ కూడా!


*మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిన తీరులా ఉంది మీ ధర్మ నిర్మాణ దీక్షలు, నవ నిర్మాణ దీక్షలు. వీటికి కోటానుకోట్ల ప్రజాధనా న్ని దుర్వినియోగం చేయటం "పబ్లిక్ ఆడిట్" క్షమించదు ప్రజలు హర్షించరు. ఒకే పనికి పలుసార్లు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మీ వ్యవహారం ప్రశ్నార్ధకమే. ఒక మహానగర నిర్మాణానికి ఆకృతులను ఐదేళ్ళలో కూడా పూర్తి చేయలేని మీ అసమర్ధత అనిర్వచనీయం. 600 వాగ్ధానాలు చేసిన మీరు 60 వాగ్ధానాలు కూడా నిజం చేయలేదని జనం ఘోషిస్తున్నారు ఇది నిస్సందేహంగా మీకు అపఖ్యాతే.


*మీ రాజకీయాలకు వద్ధాం! మీరేపార్టీతో పడితే ఆ పార్టీతో జట్టుకడితే అది రాజకీయ వ్యభిచారం అనటం తప్పుకానే కాదు. మీ రాజకీయం అవకాశవాదమే అని మీరంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని మీరు మిమ్మల్ని నిప్పు నిజాయతీ ఇలా అభివర్ణించుకుంటారు అదే జనం సహించలేరు.  కొన్ని మద్దతు మీడియా సంస్థలు కొందరు అనైతుకులు మీవెంట ఉండి మిమ్మల్ని తప్పుదారి పట్తించితే అనుభవమున్న మిమ్మల్ని ఏవరూ క్షమించరు. ఆఖరికు ఏవరూ చేయని ఎన్నికల సర్వేలు అర్ధరహితంగా ప్రకటించి నవ్వులపాలైన ఒక మీడియా సంస్థ మీకు చెసే చెరుపు అనంతం.


*వారసత్వ రాజకీయాలను గతంలో ప్రశ్నించిన మీ పుత్రవాత్సల్యమూ తీవ్ర అభ్యంతరకరం. తన నియోజక వర్గం మంగళ గిరి అని పలకలేక మందలగిరి అని పలికే మీ పుత్రరత్నం ఒక మందమతిని ఐదుకోట్ల ఆంధ్రుల నేత్తిన పెట్టటం కూడా మీకు హానికరమే.    


*చివరగా బాజపా నరేంద్ర మోడీ-ఇక్కడ అంటే ఆంధ్ర ప్రదేశ్ లో వారికి స్థానమే లేదు. మీరు మీ సామాజిక వర్గానికే చెందిన ఒక బాజపా మహానాయకుణ్ణి వాడేసి బిజెపిని గతంలో - టిడిపి తోక పార్టీ - గా నిర్మించారు. దాన్ని అర్ధం చేసుకొని రాష్ట్రంలో బిజెపికి ఉనికి కల్పిద్దామనుకున్న మోడీ - షా లకు మీరు అవకాశం ఇవ్వలేదు. అందుకే కేంద్రానికి ఆంధ్ర ప్రయోజనాలు నేరవేర్చటమంటే కంచి గరుడ సేవే! ఈ కాలంలో మీలాగే నరేంద్ర మోడీ కూడా రాజకీయ ప్రయోజనాలు లేని సహకారం రాష్ట్రాలను అందిస్తూన్న దాఖలాలు కనిపించట్లేదు. కనీసం ఆయనకు వ్యక్తిగత, వారసత్వ స్వార్ధమైనా లేదు.


*ప్రతిపక్షాలను కలుపు కొని మీరు రాజకీయం గా చక్రం త్రిప్పుతానని మీ అధికారాంతం లో విర్రవీగిన  మీ తీరుకు— రాష్ట్రానికి నరేంద్ర మోడీ మేలు ఎలా చేస్తారు. మోడీని తిట్టటానికి మీ సామాజిక వర్గంలోనికే చెందిన సినీ నటుడు శొంటినేని శివాజి, చలసాని శ్రీనివాస్ లాంటివాళ్లు పరిది దాటి మాట్లాడటం రాష్ట్రానికి చాలా చెరుపు  చేసింది. ఆఖరుకు రాజకీయ చరిత్ర లేని దివ్యవాణి లాంటి వారి అసభ్య, అభ్యంతరకమైన మాటలు ఉంటే మోడీ స్థానంలో మీరున్నా మీ రాష్ట్రానికి మేలేమి చేయరు.    


*కనీసం వారికి కొద్దిగా రాజకీయ ఆవాసం కలిపించి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు నేరవేరి ఉండేవి. మీ స్వార్ధం అనంతం కావటమే మిమ్మల్ని మూలాల్లోకి కొట్టేసింది. ఇలా చెపితే లక్షల్లో మీ తప్పులు పెట్టుకొని వేరే వాళ్లపై నెట్టేసే మీ తీరే మిమ్మల్ని మీ పార్టీని భూస్థాపితం చేస్తాయనటంలో సందేహమే లేదు. ఇంకా చిన్న చిన్న వాటిల్లో కూడా మీరు చూపించే స్వార్ధం ఏంత పరాకాష్టకు చేరిందో అర్ధం కావాలంటే ఉదాహరణకు గౌతమీ పుత్ర శాతకర్ణి - రుద్రమదేవి సినిమాల విషయంలో మీరు వ్యవహరించిన తీరు వివరిస్తే చాలు.   

మరింత సమాచారం తెలుసుకోండి: