వైసీపీ మ్యానిఫేస్టో ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుచేతనంటే మాట ఇస్తే మడమ తిప్పను, ఆచరించి చూపుతాను అని జగన్ చెప్పినట్లుగా ఉంటుందది. జగన్ సైతం సులువుగా నమ్ముతారు. అందుకే మ్యానిఫేస్టోలో నెరవేర్చే హామీలనే అందులో పొందుపరచారు.


ఇదిలా ఉండగా జగన్ ఎన్నికల ప్రణాళికను ఈ రోజు విడుదల చేశారు. ఇందులో అన్ని వర్గాలకు సమాన న్యాయం ఇస్తున్నప్పటికీ రైతులకు జగన్ పెద్ద పీట వేశారు.  ప్రతి రెతు కుటుంబాని పెట్టుబడి సాయం కింద రూ. 50వేలు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పంటలకు మద్దతు ధరతో పాటు నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయక నిధిని ఏర్పాటుచేస్తామన్నారు. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ. ఏడు లక్షలు అందించనున్నారు. అంతేకాదు ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి.. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


అలాగే కౌలు రైతులపై కూడా వరాల జల్లు కురిపించారు. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు.. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, సబ్సిడీలు వారికి అందేలా చూస్తామన్నారు అదే విధంగా,  పంటబీమా కోసం రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రిమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. ఇక  రైతన్నకు ఉచిత బోర్లు. .. పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు వంటివి కూడా హమీల్లో ఉన్నాయి. ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయిన్నర చార్జీకే కరెంటు మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటివి కూడా పొందుపరచారు. పంట వేసేముందే.. ఆయా పంటలకు లభించే మద్దతు ధరల ప్రకటన.. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 



అలాగే, ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటు మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరణ వంటివి కూడా హమీల్లో ఉన్నాయి. రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే.. ప్రతిపాడి రైతుకు లీటరుకు నాలుగు రూపాయలు బోనస్‌, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డుట్యాక్స్‌, టోల్‌ ట్యాక్స్‌ రద్దు ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ. ఏడు లక్షలు అందజేత. అంతేకాదు ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి.. ఆ రైతు కుటుంబానికి అండగా ఉండటం. వంటివి జగన్ రైతులకు ఇచ్చిన హామీలుగా ఉన్నాయి. మొత్తానికి రాజశేఖరరెడ్డి తరువాత రైతుల మీద పూర్తిగా ఫోకస్ చేసిన నేతగా జగన్ ముందున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: