విశాఖ జిల్లాలో ఢీ అంటే ఢీ అంటున్న టీడీపీ, వైసీపీలు తమదైన మార్క్ పాలిట్రిక్స్ ని ప్లే చేస్తున్నాయి. ఓ పార్టీ పై చేయి సాధిస్తోందని తెలియడంతోమరో పార్టీ ఆ లోటును భర్తీ చేసుకుంటోంది. మొత్తానికి అనేక చోట్ల నువ్వా నేనా అన్న పరిస్థితి ఉంది.


ఇక ఉత్తర నియోజకవర్గంలో పోటీలో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు దెబ్బ కొట్టడానికి వైసీపీ నిన్న బలమైన కాపు నాయకుడు గుంటూరు కుటుంబాన్ని పార్టీలోకి లాగేసింది. దానికి దెబ్బ అన్నట్లుగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వెలమ సామాజిక వర్గానికి చెందిన తైనా విజయ కుమార్ ని టీడీపీ లాగేసింది. దీంతో షాక్ తినడం వైసీపీ వంతు అయింది.


ఇక్కడ తైనాలకు మంచి పట్టు ఉంది. పైగా 2009 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా పరిణామాలు చూసుకుంటే వైసీపీ అభ్యర్ధి కేకే రాజు అన్ని విధాలుగా బలంగా ఉన్నారు. ఆయనకు అన్ని వర్గాలు మనసు పెట్టి పనిచేస్తున్నాయి. ఈ టైంలో బలమైన వలెమన నేతను తమ వైపు తిప్పుకోవడం ద్వారా గంటా విజయం సాధించారు. ఈ పరిణామలతో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లైంది. ఇక్కడ తైనాలకు 11 మంది వార్డ్ అధ్యక్షుల  మద్దతు ఉందని తెలుస్తోంది. మరి దీనికి విరుగుడుగా వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: