ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యా పార్టీ నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ మేనిఫెస్టోలు విడుదల చేశారు.  గతంలో బాబు గారు విడుదల చేసిన మేనిఫెస్టో లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని..అన్నీ అబ్బద్దపు హామీలే ఇచ్చారని వైసీపీ నేత జగన్ అన్నారు.  నేడు ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో పేదల కోసమే అని..బడుగు బలహీన వర్గాల వారికోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని..ఆయన బాటలోనే నడుస్తున్న తనను ప్రజలు అక్కున చేర్చుకున్నారని..వారిని తన జీవితాంతం సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. 


ఉగాది పర్వదినం సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.  ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మనరాష్ట్రంలో కాపు సోదరులు వీరంతా కూడా రిజర్వేన్‌ కల్పించాలని కోరుతున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం.

కమ్మ వర్గాల్లోనూ ఎంతో మంది పేదలున్నారన్న సంగతి తనకు తెలుసునని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు.  వారి అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ తెలిపారు. కమ్మ వర్గం ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారని, వారి బిడ్డలను ఉన్నత చదువులు చదివించి, ప్రయోజకులను చేసే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. కమ్మ వర్గాల్లో అట్టడుగున ఉన్న ప్రజలకు ఏ ప్రభుత్వమూ చేయనంత సాయం చేస్తానని జగన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: