ఆంధ్రప్రదేశ్ లో 2019 శాసన సభ, లోక్ సభ ఎన్నికలు ఆపై ఎల్లుండే...ఎన్నికల వేడి భానుని సూర్య ప్రతాపాన్ని తీసి అవతల పడేస్తుంది.  మన తెలుగు నాట రాజకీయం ఎలా ఉందంటే..‘యుద్దంలో మంచి-చెడు, పాపం - పుణ్యం అనేవి ఉండవు, గెలవడం - ఓడటం అన్నట్లు’ ఏం చేసినా నంబర్లు వస్తే చాలన్నట్లు.


ఎలాంటి నాయకులను చూశారు మనవాళ్లు...పుట్టు జమిందారయి,  ప్రజల కోసం చెట్టు-పుట్టలు పట్టుకొని తిరిగి పుచ్చలపల్లి సుందరయ్యను, ఆయనను పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి ముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెయించుకుని ఆయన అడుగు జాడల్లో కష్టపడిన వారి అర్థాంగిని..ఇలాంటి మహానుభావులు ఎందరినో చూసిన తెలుగు నేల ఈ నాటి రాజకీయ పరిస్థితులను చూసి బెంగ పడుతుందటున్నారు ఆంధ్రప్రజ.


ఆపై ఎల్లుండే ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే నాయకులెవరో ప్రజాదరణ, ప్రజా మెప్పు కంటే ఎక్కువగా సానుభూతి, మైండ్ గేమ్, పరనింద, స్వ పొగడ్తలతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు తెలుగు ఆంధ్రప్రజ.


జగన్, విజయమ్మ,షర్మిల.. వీరంతా ఒకవైపు తాము గెలిస్తే ఏమి చేస్తారో అని చెపుతూ ప్రజలతో మమేకం అవుతుంటే..మిగిలిన వారేమో వీరిని ఎంతో ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారంటున్నారు వైసీపీ అభిమానులు.


ఏదేమయినా ఆంధ్రఓటర్లు, తెలుగు ప్రజలు విజ్ఞులు, వివేకవంతంగా తమ నాయకుడిని ఎన్నుకుంటారు, ఇలాంటి మైండ్ గేమ్ లు, వారి నిర్ణయాలను ప్రభావితం చేయదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఆపై ఎల్లుండి పోలింగ్, మే  23న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఆల్రెడీ నిర్ణయంచేశాము, ఆ తేదీలు రావడమే తరువాయి అన్నట్లుంది ఆంధ్రప్రజ అంతరంగం.. మరి అలాంటపుడు నాయకులందరూ హుందాతనం కోల్పోకుండా ప్రవర్తిస్తే మంచిది కదా అంటున్నారు విశ్లేషకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: