కార్పొరేట్ చాణక్య అనే సంస్థ సర్వే ఫలితాలు వెల్లడించిందంటూ ఆదివారం సాయంత్రం ఏబీఎన్ చానల్ హాడవిడి చేసింది. ఈ సర్వేలో టీడీపీకి 101 సీట్లు, వైసీపీకి 71 సీట్లు, జనసేనకు 3 సీట్లు వస్తాయని ఆ సర్వే చెప్పినట్టు ప్రకటించారు. 


మార్చి 15- ఏప్రిల్‌ 5 మధ్య 175 నియోజకవర్గాల్లో..సర్వే నిర్వహించారట. 

వివరాలు ఇవీ.. 

టీడీపీకి 101 సీట్లు, వైసీపీ 71 సీట్లు, జనసేన 03 సీట్లు

శ్రీకాకుళం(10)       - టీడీపీ 5, వైసీపీ 5, జనసేన 0, ఇతరులు 0
విజయనగరం(09) - టీడీపీ 5, వైసీపీ 4, జనసేన 0, ఇతరులు 0
విశాఖ(15)                - టీడీపీ 9, వైసీపీ 5, జనసేన 1, ఇతరులు 0
తూర్పుగోదావరి(19)- టీడీపీ 13, వైసీపీ 6, జనసేన 0, ఇతరులు 0
పశ్చిమగోదావరి(15)  - టీడీపీ 10, వైసీపీ 3, జనసేన 2, ఇతరులు 0
కృష్ణా జిల్లా(16)        - టీడీపీ 9, వైసీపీ 7, జనసేన 0, ఇతరులు 0
గుంటూరు(17)            టీడీపీ 11, వైసీపీ 6, జనసేన 0, ఇతరులు 0
ప్రకాశం(12)             - టీడీపీ 7, వైసీపీ 5, జనసేన 0, ఇతరులు 0
నెల్లూరు(10)             - టీడీపీ 2, వైసీపీ 8, జనసేన 0, ఇతరులు 0
కడప(10)                 - టీడీపీ 2, వైసీపీ 8, జనసేన 0, ఇతరులు 0
కర్నూలు(14)             - టీడీపీ 7, వైసీపీ 7, జనసేన 0, ఇతరులు 0 
అనంతపురం(14)      -టీడీపీ 11, వైసీపీ 3, జనసేన 0, ఇతరులు 0
చిత్తూరు(14)               - టీడీపీ 10, వైసీపీ 4, జనసేన 0, ఇతరులు 0
ఉత్తరాంధ్ర(34)          - టీడీపీ 19, వైసీపీ 14, జనసేన 1
కోస్తా(89)                      - టీడీపీ 52, వైసీపీ 35, జనసేన 2
రాయలసీమ(52)         -   టీడీపీ 30, వైసీపీ 22, జనసేన 0

ఐతే.. ఈ పేరుతో ఏ సర్వే సంస్థ ఉన్నట్టు ఇంతవరకూ తెలియదు.. కొద్ది రోజుల క్రితం లోక్ నీతి అనే సంస్థ చేసిన సర్వే పేరుతో ఆంద్రజ్యోతి ఒక సర్వేను విడుదల చేసింది. అలాంటి సర్వే ఏది తాము ఇవ్వలేని లోక్ నీతి సంస్థ ప్రకటించింది.తాజాగా కార్పొరేట్ చాణక్య పేరుతో మరో సర్వేని వదలింది. 

నిజానికి ఇలాంటి పేరుతో అసలు సంస్థ ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఆ పేరుతో ఎక్కడా వెబ్ సైట్ కూడా లేదు. టుడే చాణక్య అనే ప్రముఖ సర్వే సంస్థ పేరుకు దగ్గరగా ఉండేలా కార్పొరేట్‌ చాణక్య అనే సర్వే కంపెనీని సృష్టించి.. ప్రజల్లో గందరగోళం లేపే ప్రయత్నం చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: