అనంతపూర్ నియోజకవర్గం ఈ వేసవి ఎండల కన్న వేడిగా రాజకీయ వేడి ఎక్కువ సెగ కొడుతుంది. ప్రతి పార్టీ తమ గెలుపు కోసం అలుపు లేకుండా ప్రచారాలు కొనసాగిస్తున్నారు.

అభ్యర్థులు : టీడీపీ నుంచి ప్రభాకర్ చౌదరీ పోతిలో ఉండగా అటు వైసీపీ నుంచి అనంత వెంకట రామి రెడ్డి అలాగే ఈ సారి జనసేన నుంచి టీసీ వరుణ్ ను బరిలో దింపారు. 

ఎవరి బలం ఎంత ? :క్రితంసారి ఎన్నికల్లోనే కేవలం 9 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి ప్రభాకర్ చౌదరి వైఎస్ఆర్సీపీకి చెందిన గురునాథ రెడ్డి పైన గెలుపొందాడు. దాదాపు అంతా ఇక్కడ టీడీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండే ఏకైక రాయలసీమ జిల్లాగా ఈ అనంతపురానికి పేరు. ఆర్థికంగా వెనుకబడిన ఈ జిల్లా సరైన అభ్యర్థుల వేటలో అనునిత్యం ఉంటుంది. 

ప్రభాకర్ చౌదరీ అనుకూలతలు మరియు ప్రతికూలతలు : ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు చేసింది ఏమి లేదు, నగరం లో అభివృధి ఎక్కడిక్కడ అలాగే ఉంది. అధికారంలో టీడీపీ పార్టీ ఉన్న కూడా సరిగా పట్టించుకోలేదని అంటున్నారు. ఇవ్వన్నీ ప్రతికూలతలు అయితే. టీడీపీ పార్టీ బాగా మద్దతు ఉన్న ప్రాంతం అనంతపురం. ప్రజలు దాదాపు టీడీపీ వైపే మొగ్గు చూపుతారు అది బహుశా చంద్రబాబు గారిని చూసి అయ్యుండొచ్చు. 

వైసీపీ పార్టీ హవా : ఈసారి కాస్త వైసీపీ వైపు ఇక్కడి ప్రజల చూపు మళ్ళింది అనిపిస్తుంది. మొన్నటి దాకా ఇక్కడ జరిగిన ప్రచారంలో వైసీపీ వచ్చిన ప్రజాదరణ చూసి చెప్పవచ్చు. కాబట్టి కాస్త గట్టిగా ప్రయత్నిస్తే గెలుపు సాధ్యం అవ్వొచ్చు.

గెలుపెవరిది ? : టీడీపీ కి మద్దతు నిలిచే అనంతపురం లో గెలుపు ఎవరిది అనే దాని పై మిశ్రమ స్పందన వస్తుంది. కాకపోతే వైసీపీ ఖాతాలో విజయం ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. టీడీపీ కి ఉన్న తన మేనియా తో గెలుపు అవకాశాలు పెంచుకుంటుంది. జనసేన మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి చాల వరకు యూత్ ఓట్లు ఈ పార్టీ కి పడచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: