జనసేన విశాఖ లోకసభ అభ్యర్థి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ ఓటర్లకు బాండ్ పేపరు మీద తన వాగ్ధానాలు నేరవేర్చగలనని రాసిచ్చారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేస్తానని చెబుతూ ₹100/- ఆ బాండ్ పేపర్ రాసిచ్చారు. దాంతో ఆయన ఒక్కసారిగా ఉన్నత స్థాయిని అక్రమించారు వార్తలలోని వ్యక్తి అయిపోయారు. నమ్మకం కలిగించటంలో ఇతర రాజకీయనేతల కంటే ఒక అడుగు ముందే ఉన్నట్లు ప్రశంసల వర్షం కురిసింది.  వివి లక్ష్మీనారాయణ ఓటర్లకు రాసిచ్చిన బాండ్ పేపర్ ఒక చెల్లని కాగితమనే మాట వినిపిస్తోంది. అందుకు తగిన కారణాలను న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక ఉన్నత మైన పదవిని విజయవంతంగా నిర్వహించి అదే కీర్తిని రాజకీయాలకు పునాది వేసుకున్న లక్ష్మినారాయణకు ఆ విషయం తెలియదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
EX JD VV Lakshmi Narayana to Vishaka కోసం చిత్ర ఫలితం
వంద రూపాయల విలువ చేసే స్టాంప్ పేపరు మీద సంతకం చేసి ఆయన బాండ్ పేపర్ ఇచ్చారు. అందులో ఆయన కిరాయికి ఉండే ఇంటి చిరునామా తప్ప మరేం లేదు. ఆధార్ కార్డు నెంబర్ గానీ, ఫోన్ నెంబర్ గానీ, ఏ ఇతర వ్యక్తిగత, నివాస, ఉద్యోగ గుర్తింపు వివరాలు పొందుపరచలేదట. తాను పోటీ చేస్తున్న జనసేన పార్టీ ప్రస్తావన కూడా అందులోలేదు. ఇది ఆయన తెలిసి చేశారా? తెలియక చేశారా? అనే సంశయం ఉత్పన్నమవుతోంది. న్యాయనిపుణులు చెప్పిన వివరాల ప్రకారం లక్ష్మినారాయణ రాసిచ్చిన బాండ్ పేపరు చెల్లదు. చిత్తుకాగితంతో సమానమట. 
EX JD VV Lakshmi Narayana to Vishaka కోసం చిత్ర ఫలితం
బాండ్ పేపరు చెల్లక పోవటానికి కారణం: స్టాంపు పేపరు మీద రాసి ప్రజలకు ఇవ్వప్రయత్నించటం "భారతీయ కాంట్రాక్టు చట్టం" ప్రకారం ఒప్పందం కాదు. అంతే కాకుండా పూర్తి కొత్తవారితో ఒప్పందం కుదుర్చుకోవడం కుదరదు. పేరు, చిరునామా, ఇతర వివరాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు లేదా పక్షాల మధ్య మాత్రమే ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలుంటుంది. ఇలాంటి లక్షణం లక్ష్మినారాయణ రాసిన బాండ్ పేపరుకు లేదు. ఒప్పందానికి మూలమైన "ప్రతిఫలం" ఏమిటో తెలుప నందున అది ఒప్పందం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. "ప్రతిఫలం పరిమాణం" ఎంతో తెలియజేయకుండా ₹100/-ఎంజేఎస్ అంటే నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్ (న్యాయేతర స్టాంపు పేపరు) వాడాలని ఎలా నిర్ణయించారు? అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. 
EX JD VV Lakshmi Narayana to Vishaka కోసం చిత్ర ఫలితం
ఆ కేసు పూర్వా పరాలే మంటే: "మిథిలేష్ కుమార్ పాండే వర్సెస్ భారత ఎన్నికల సంఘం" కేసులో సుప్రీం కోర్టు ప్రకటించిన నిర్ణయం ప్రకారం దాన్ని అమలు పరచడం సాధ్యం కాదు. దానికి హేతుబద్దత లేదు. ఎన్నికల ప్రణాళికలను అమలు చేయాలని ఏ పార్టీ పైన కూడా ఒత్తిడి తీసుకురాలేమని గతంలో ఒక కేసులో ఇదివరకే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 
mithilesh kumar panDe Vs Election Commision కోసం చిత్ర ఫలితం
మిథిలేష్ కుమార్ పాండేకు, భారత ఎన్నికల సంఘానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు: ప్రజాప్రాతినిధ్య చట్టంప్రకారం ఎన్నికల ప్రణాళికలో చేర్చేహామీల విషయంలో రాజకీయ పార్టీలకు ఉన్న అధికారాన్ని అదుపు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రణాళికలో ఏ విధమైన హామీలు ఇవ్వాలని? ఎలాంటి హామీలు ఇవ్వకూడదు? హామీల పరిమాణం ఎంత అనేదానిని శాసించటం అమలుపర్చటం కోర్టు పనికాదని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితిలో వివి లక్ష్మినారాయణ ఓటర్లకు రాసిచ్చిన బాండ్ పేపరు చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. 

mithilesh kumar panDe Vs Election Commision కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: