నందమూరి బాలకృష్ణ అభిమానలుపై చేయి చేసుకోవడం.. బూతులు తిట్టడం  సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే బాలకృష్ణ మరోసారి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అభిమానిని పరుగెత్తించి మరీ కుమ్మేశాడు. విజయనగరంలో జిల్లాలోనే మరో ఘటనలో తనను ఫోటో తీస్తున్న ఓ అభిమాని చేతి నుంచి సెల్ ఫోన్ లాక్కుని.. తనదైన స్టైల్లో నోటికి పని చెప్పాడు. 


అయితే బాలయ్య తీరు మార్చుకోవాలన్న విమర్శలు జోరుగా వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ను చూసి కాస్త నేర్చుకో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల ఓ సభలో పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు.. వేదికపైనే హఠాత్తుగా పవన్ కాళ్లపై పడ్డాడు. అయితే అతడు కాళ్లపై పడిన తీరు.. కాళ్లుపట్టుకునేందుకు చేసిన ప్రయత్నంగా కాకుండా.. పవన్‌ పైదాడి చేస్తున్నట్టు ఉంది. దీంతో పవన్ ఒక్కసారిగా బాలెన్స్ కోల్పోయి తూలి మెల్లగా కిందపడ్డారు. 

ఈ సమయంలో పవన్ చాలా హుందాగా వ్యవహరించారు. అతడిపై తాను చేయి చేసుకోలేదు. తానే కాదు.. అభిమానులు కూడా కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సమయంలోనే కాదు..గతంలోనూ పవన్ అభిమానుల పట్ల హుందాగానే వ్యవహరిస్తారు. మీ వల్లే నేను ఈస్థాయిలో ఉన్నా అంటాడు. 

సాధ్యమైనంత వరకూ అభిమానులను మంచి మార్గంవైపు నడిపించేలా ఉపన్యాసాలు ఇస్తుంటాడు.. పాపం.. బాలయ్య ఇలాంటివి చూసయినా తన ప్రవర్తన మార్చుకుంటే మంచిది. వాళ్లు తన బానిసలు కారని.. తనను ఎంతగానో అభిమానించే అభిమానులను గుర్తిస్తే ఫ్యాన్స్ చాలా సంతోషపడతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: