తెల్లారితే ఎన్నికలనగా ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఓటింగ్ శాతం తగ్గించాలని చూస్తున్నారా..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు?


స్వయాన ఒక ముఖ్యమంత్రే ఇలా చేస్తే..? అసలు ఎన్నికల కోడ్ పరిథిలో ఉన్న నాయకులెవరైనా రేపు ఎన్నికలనగా ఇలా చేస్తారా? ఇది నైతికమా..?
ఇలాంటి ప్రశ్నలన్నింటికి మూలం తెదేపా అనుకూల మీడియలో వస్తున్న లీకులు... వాటి ఆధారంగా వైసీపీ నాయకులు ఎన్నికల కమీషన్ కు రాసి లేఖలు. 


చట్టాలు, న్యాయాలు వాటిలోని నియమాలు - లొసుగులు పక్కన పెడితే..ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ప్రజల నుంచి ఆమోద పత్రం తీసుకునే మహదావకాశమే ఎన్నికలు, ప్రజా స్వౌమ్యంలో ఎన్నికలకు మించిన ముఖ్యమైన ఘట్టం మరొకటుందేమో. 

అలాంటి సందర్భంలో ఏ పార్టీ అయినా - ఏ నాయకుడయినా ఇలా చేయాలనుకోవడమే దుర్మార్గం కందా అంటున్నారు ప్రజాస్వౌమ్య వాదులు. 

ముఖ్యమంత్రి భాద్యతాయుత పదవి లో ఉన్న నాయకులు ఇలా చేయబోతారని మేం ఊహించడం లేదు అని అంటున్నారు ఆంధ్రప్రజ... చూడాలి మరి ఏం జరుగుతుందో...?


మరింత సమాచారం తెలుసుకోండి: