కుల రాజకీయాలు అన్నవి కొత్త కాదు, కానీ అవి ఇపుడు పెరిగి పెద్దవై అఖరికి పార్టీల తల రాతలను మార్చేస్తున్నాయి. ఏపీలో మొదటి నుంచి ఆ వాతావరణం ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా చూసుకుంటే అది మరింత పెరిగి ఇపుడు ఆ వూసు లేకుండా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్నది అర్ధమవుతోంది.


ఈసారి జరిగే ఎన్నికలు కూడా కులం ఆధారంగానే తీర్పులు వస్తాయని అంతా భావిస్తున్నారు. ఏపీలో  ప్రధానంగా కాపులు ఈసారి ఏ వైపు ఉంటారన్న దాని మీదనే అధికారం ఎవరిది అన్నది ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ప్రాంతాల వారీగా చూసినపుడు గోదావరి జిల్లాలు చాలా ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు విజయం సాధిస్తే వారే రేపటి రోజున ఆధికారంలోకి వస్తారని అంటున్నారు.


ఇక కాపులు మూడు ప్రధాన పార్టీల మధ్య చీలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని వల్ల ఏ పార్టీ లాభపడుతున్న్నది చూడాలి. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను ఎవరు పంచుకుంటారన్న దాని మీద కూడా ఫలితాలు ఆధారపడితుంటాయి. ఏపీలో రాజకీయం ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంది. అందువల్ల ప్రధామైన సామాజిక వర్గం కాపులు ఓ విధంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని భావించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: