ఎన్నికల్లో ఒకవేళ ఓటమి పాలు అయితే కారణాలు చూపించడానికి టీడీపీ దారులు వెతుక్కుంటోందా. దానికి సంబంధిని గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారా. ఈ రకమైన సందేహాలు ఇపుడు అందరికీ కలుగుతున్నాయి. చంద్రబాబు ఈ రోజు ఈసీ ఎదుట నిరసన దీక్షకు కూర్చుకున్నారు. ఆయన నిరశన అన్నది ఒక ఎత్తుగడగా ప్రతిపక్షాలు ఓ వైపు చెబుతున్నా బాబు మాత్రం దీన్ని చేపట్టడం వెనక కారణాలు ఏంటన్నది అందరి మదిలో మెదులుతోంది. తెల్లారితే పోలింగ్. అయినా చంద్రబాబు ఈ కానీ సమయంలో దీక్షలు పేరుతో రచ్చ చేయడం ద్వారా రెండు విషయాలను చెప్పదలచుకున్నారని అంటున్నారు.


కేంద్రం, కేసీయార్, జగన్ వంటి వారు తనను, తన పార్టీని వేధిస్తున్నారని చెప్పడానికి బాబు ఈ దీక్షను చేస్తున్నారని అంటున్నారు. దాని వల్ల సానుభూతి ఏమైన వస్తే పార్టీకి మైలేజ్ వస్తుందన్నది ఓ అంచనాగా భావిస్తున్నారు. అదే సమయంలో ఓటమి కనుక చెందితే అంతా కలసి తనను ఓడించారని కూడా బాబు చెప్పుకుంటున్నారని అంటున్నారు.ఇక బాబు దీక్ష చేపట్టడం రాజ్యాంగ నిభంధనలకు విరుద్ధం అని కూడా అంటున్నారు.


ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు దీక్షలు, ఆందోళను నిషిద్ధం. అలాంటిది బాబు చేయడాన్ని అంతా తప్పు పడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయబాబు దీని మీద మాట్లాడుతూ బాబుకు అల దీక్ష చేయకూడదని తెలియదా అని నిలదీశారు. ఇక ఏపీలో ఓడిపోతామని అంచనాకు వచ్చిన మీదటనే టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడుతోందని, డ్రామాలు ఆడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసిమ్హారావు అంటున్నారు. మొత్తానికి బాబు ధర్నా చేయడం ద్వారా ఓటమి భయాన్ని బయటపెట్టుకునారని అంటున్నారు. చూడాలి మరి. ఏం జరుగుతుందో



మరింత సమాచారం తెలుసుకోండి: