పవన్ కళ్యాణ్ 2014 లో పార్టీ పెట్టి నాలుగేళ్లు కాలక్షేపం చేసిన సంగతి తెలిసిందే. కొత్త రకం రాజకీయాలు చేస్తానని పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పవన్ పార్టీ కూడా అన్నీ ముక్కలో ఒక ముక్క అని అర్ధం అయిపొయింది. పార్టీ పెట్టినప్పుడు తనకు, తన పార్టీకి కులం లేదని, అలాగే మనీ పాలిటిక్స్ చేయనని. కానీ ఈరోజు భీమవరం సిట్యువేషన్ చూస్తుంటే ఈ రెండు సిద్దాంతాలకు పవన్ తిలోదకాలు ఇచ్చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే భీమవరం నుంచి పోటీ చేయాలని డిసైడ్ చేసుకోవడం వెనుకే కులం ఓట్లు అధికంగా వున్నాయనే ధీమా వుంది. స్ట్రాటజీ వుంది.


అదే సమయంలో నియోజక వర్గంలో బలమైన క్షత్రియ కులానికి చెందిన నాయకులు ముగ్గురిని కలిసి, వారికి ప్రచారం, ఎన్నికల నిర్వహణ అప్పచెప్పారు. అది చాలదన్నట్లు ఎన్నికలకు మూడురోజులు ముందు క్షత్రియులను రెచ్చగొట్టేలా, సత్యం రామలింగరాజు - వైఎస్ వ్యవహారం అంటూ స్పీచ్ లు ఇచ్చారు. అంటే కుల రాజకీయం చేయాలని ప్రయత్నించినట్లే కదా? సరే ఆ సంగతి వదిలేస్తే, నిన్నటికి నిన్న భీమవరం లో ఎప్పటిలాగే అన్ని పార్టీలు నోట్ల పంపిణీకి తెరతీసాయని జనం చెప్పుకుంటున్నారు.


దేశం, వైకాపా బాగానే పంచాయని టాక్ విపరీతంగా వినిపిస్తోంది. అది ఊహించిందే కూడా.  కానీ జనసేన తరపున కూడా యథాశక్తి పంపిణీ కార్యక్రమం జరిగిందని వినిపించడం విశేషం. మిగిలిన పార్టీల రేంజ్ లో కాదు కానీ, ఓ మాదిరిగా బాగానే చేసారని జనాల్లో వినిపిస్తోంది. అంటే ఈ విషయంలో కూడా పవన్ తన నియమాన్ని వదిలేసారా? లేక పవన్ కు తెలియకుండా, పార్టీ నాయకులు ఈ పని చేసారా?  మొత్తంమీద జనసేన కూడా భిన్నమైన రాజకీయ పార్టీ కాదని, ఆ తానులోని ముక్కే అని అనుకోవాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: