ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజలకు ధైర్యం కలిగించి.. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేయవాలసిన సమయమిది..ఎన్నికలు రేపే.


మరి ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు..ఎన్నికల అధికారిని కలిసి ఎన్నికల కమిషన్ పని బాలేదంటూ చెప్పడం కాకుండా..వారు వాడిన పదజాలం, హావ-భావాలు కోట్ల మంది ప్రజల్లో ఎటువంటి సంకేతాలు తీసుకు వెళ్తాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు దిగితే..దీనిని వదలం-తేల్చుకుంటా అని అంటే సాధారణ ఓటర్లు భయపడరా? భయపడరుో కనీసం ఏంటిది, ఇలాంటి పరిస్థితుల్లో రేపు మనం ఓటెయ్యాలా అని ఆలోచించరా? దీని వలన ఓటింగ్ శాతం తగ్గితే ప్రజల తమను పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోరా?  అంటున్నారు ప్రజాస్వౌమ్యులు.


అసలు ఇలాంటి పనేదైనా జగన్ చేయనక్కరలేదు..జగన్ చేయబోతున్నాడని మీడియా లీకిచ్చినా..ఇదో ఇదే మేం భయపడిన రౌడీ రాజ్యమని నెత్తీనోరూ కొట్టుకుంటూ కిందకి-మీదకి-కిందకు అయ్యేవారు కాదా తెదేపా నాయకులు వారి  సానుభూతి మీడియా ఛానెళ్ళు అని నిలదీస్తున్నారు జగన్ అభిమానులు, వైసీపీ సానుభూతిపరులు..అరే నిజమేకదా అంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: