ఏపీలో గెలుపెవరది..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో ఏ ఇద్దరిని కదిలించినా జరిగే చర్చ ఇది.. మరి ఇంతకూ గెలిచేదెవరు.. ఇంకోసారి ఛాన్స్ ఇమ్మని అడుగుతున్న నలభయ్యేళ్ల అనుభవానిదే.. లేదా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ బతుకుల్లో రాజశేఖర్ రెడ్డిలా పాలించి చూపుతా.. ఇదీ తేలాల్సి ఉంది. 


ఇప్పుడు ఏపీలో జనం ఒక్కఛాన్స్‌ కే ఓటేయాలని నిర్ణయించుకున్నారు. 40 ఏళ్ల అనుభవం తమకు ఒరగబెట్టిందేమీ లేదన్న అంచనాకు వచ్చేశారు. చూసింది చాలు.. ఇంకా ఎన్నేళ్లు చూస్తాం.. కొత్త తరానికి కొత్త ఆలోచనలకు పట్టం కడతామని నిర్ణయించుకున్నారు. 

ఈ విషయం ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడైంది. ఏపీలో గెలిచేది జగనే అని పోల్ డాక్టర్లెందో నిర్దరణ చేసి మరీ చెప్పేశారు. ఇటీవల ఏపీ సీఎం తన ప్రచారం చివరి రోజుల్లో చేసిన ఎలక్షన్ ఫీట్ ఆసక్తికరంగా మారింది. చర్చకు దారి తీసింది. ఆయన చివరిలో ప్రతి సభలోనూ  ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా అంటూ పదే పదే వంగే శీన్.. ఏపీ జగన్ పరిస్థితిని అంచనా వేసేలా చేస్తోంది. 

అయినా సరే.. గత అనుభవాల నేపథ్యంలో చివరి వరకూ పోరాడాలనే జగన్ నిశ్చయించారు. గతంలో ఇలానే దెబ్బి తిన్న విషయాన్ని శ్రేణులకు గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు కు మాత్రం ముందుగానే భవిష్యత్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇక ఓటరు ఎవరిని కరుణిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: