నిజానికి ఎన్నికల షెడ్యూల్ మొదలైన దగ్గర నుండి ఫలితాలు పూర్తయ్యేవరకూ యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  అధికారులను బదిలీ చేయటం, బాధ్యతల నుండి తప్పించటం మొత్తం ఈసీ ఇష్టమే. కానీ చంద్రబాబునాయుడు మాత్రం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేదిపై మండిపడిన విషయం అందరూ చూసిందే.  ఓ ముఖ్యమంత్రి ఎన్నికల కమీషన్ కార్యాలయానికి రావటం, ధర్నా చేయటం చరిత్రలో ఇదే మొదటిసారనే చెప్పాలి.

 

ఇంతస్ధాయిలో చంద్రబాబు ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందా ? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు కొందరు ఉద్యోగులను ఈసి బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకంతలా మండిపోయారు ?  ఎందుకంటే, ఈసి తీసుకున్న ఓ నిర్ణయం చంద్రబాబుకు ఏమాత్రం రుచించలేదట. అసలే అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబులో అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాని మీద ఈసి నిర్ణయంతో మండిపోయింది. అందుకే అంతలా మండిపడ్డారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికల పోలింగ్ సిబ్బందిగా చాలా చోట్ల ఎన్నికల కమీషన్ ప్రైవేటు విద్యాసంస్ధల్లోని సిబ్బందిని నియమించింది. అయితే వారిలో అత్యధికులు తెలుగుదేశంపార్టీ నేతలకు చెందిన విద్యాసంస్ధల్లోని ఉద్యోగులేనట. అందులోను భాష్యం, నారాయణ, శ్రీ చైతన్య సంస్ధల్లోని ఉద్యోగులేనట. గుంటూరు, నెల్లూరు, కడప, చిత్తూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తారంధ్రలో కూడా ఇదే విధంగా నియమించారట.

 

విషయం తెలియగానే వైసిపి నేతలు ఆ విషయాన్ని ఈసి దృష్టికి తీసుకెళ్ళారు. పోలింగ్ సిబ్బందిగా తమ వారినే  నియమించుకుని దొంగఓట్లకు తెరలేపాలని టిడిపి నేతలు ప్లాన్ చేశారట.  వైసిపి నేతల ఫిర్యాదుతో విషయంపై విచారించిన ఈసి మొత్తం ప్రైవేటు సంస్ధల సిబ్బందిని తొలగించిందట.  రిజర్వులో ఉంచిన ప్రభుత్వ ఉద్యోగులను అప్పటికప్పుడు డ్యూటీ వేశారట. ఆ విషయం తెలియగానే చంద్రబాబుకు మండిపోయిందిట.

 

ఎన్నో రోజుల నుండి ప్లాన్ చేసి తమ సంస్ధల్లో పనిచేసే సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి ఎన్నికల విధుల్లోకి చొప్పించారు. వారిద్వారా పోలింగ్ ఏజెంట్లను లోబరుచుకుని తమ ఇష్టారాజ్యంగా ఓట్లను వేయించుకోవాలన్న ప్లాన్ చివరి నిముషంలో బెడిసికొట్టింది. అందుకు ఈసినే కారణమన్న కారణంతో చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయింది. అందుకనే ఆ అక్కసునంతా ఏకంగా ద్వివేది మీదే చూపించారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: