ఈ సరి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం విశేషం. జనాలు తండోపతండాలుగా బయలుదేరారు. సాధారణంగా ఇళ్లకు వెళ్లి, రమ్మని బతిమాలి పోలింగ్ కేంద్రాలకు జనాలను తీసుకురావడం గతంలో జరిగేది. ఇది కామన్. కానీ ఈసారి జనాలు పొద్దుటి నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. అది కూడా అందరూ నవ్వుతూ, తుళ్లుతూ, హుషారుగా వచ్చారనే అన్నివైపుల నుంచి వార్తలు అందుతున్నాయి. మరి దీని భావం ఏమిటి? ఇది ఎవరికి అనుకూలం? ఎవరి విజయానికి సంకేతం?


ఈసారి మహిళలు, ముఖ్యంగా వృద్దులు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు స్వచ్ఛందంగా వచ్చారు. గతంలో కూడా వృద్దులు వచ్చేవారు కానీ, ఈసారి మరీ ఎక్కువగా వచ్చారు. వృద్దాఫ్య పింఛను పెంచిన ప్రభావం ఇది అని, తెలుగుదేశం పట్ల కృతజ్ఞత ప్రదర్శించడానికి వచ్చారని జనాల్లో టాక్ వినిపిస్తోంది. ఇది నిజమేనా? మహిళలపై పసుపు కుంకుమ స్కీము పనిచేసిందని, అందుకే మహిళలు పెద్దసంఖ్యలో ఓటింగ్ కు వచ్చారని టాక్ వినిపిస్తోంది.


కాదు, మహిళల్లో కూడా చీలిక వచ్చిందని, జగన్ కు అవకాశం ఇద్దామని వచ్చారని మరో టాక్. ఏది నిజం? పోలింగ్ ఇలా స్టార్ట్ కాగనే దేశం అనుకూల మీడియాలో, వెబ్ సైట్లలో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడతోందని, దేశానికి ఓట్లు వేస్తే, వైకాపాకు పడుతున్నాయని గోల మొదలైంది. కానీ మద్యాహ్నం వేళకు ఆ మీడియా అంతా సైలంట్ అయింది. ఎందువల్ల? ట్రెండ్ దేశానికి అనుకూలంగా వుందని ఏమైనా అంచనా అందిందా?

మరింత సమాచారం తెలుసుకోండి: