టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చానని ప్రజల్లోకి వెళ్లారు.  నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేశారు.  


గాజువాక.. ఆంధ్రప్రదేశ్ అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గము గాజువాక,  విద్యావంతులు, మేథావులు, ఆంధ్ర విశ్వ విద్యాలయాలకు నిలయమైన వైజాగ్ లో అత్యంత ముఖ్యమయిన ప్రాంతం, నియోజకవర్గం. 


భీమవరం...  అస్సలు గోదావరి జిల్లా అనే మాట అది తూ.గో అయినా ప.గో అయినా వినవచ్చిన వెంటనే మన మనఃస్పురణకు వచ్చేది భీమవరం.  పంచారామాలు, తలుపులమ్మతల్లి, గోదావరి తీర్థాలు, రాజులు, మిలటరీ హోటళ్లు..అబ్బో వంశీగారి సినిమాలెన్ని చెప్పుకున్నా తరగనంత అందం.


గాజువాక, భీమవరంల నుండి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పోటీ చేసిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రెండు స్థానాల నుండి గెలుపొందే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


చిరంజీవి గారు రెండింట పాలకొల్లు ఓడి, తిరుపతి మాత్రమే గెలిస్తే..పవర్ స్టార్ పవన్ మాత్రం రెండూ గెలిచే అవకాశం ఉందంటేనే తెలుస్తుంది పవన్ సత్తా ఏంటో.


పవన్, జనసేన అద్యక్షులుగా.. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అడుగు పెట్టే పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణం చేసే ఘట్టం.. అధ్యక్షా అంటూ బీదవారి గొంతుకయ్యి ప్రశ్నించే విధానాన్ని తలచుకుంటేనే ఒడలు పులకరిస్తుందంటున్నారు పవన్ అభిమానులు, తెలుగు ప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: