ఎన్నికల పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి రెండు పార్టీల నేతలు తమ తమ అంచనాల్లో మునిగిపోయారు. ఎక్కడెక్కడ మనం బలంగా ఉన్నాం.. ఎక్కడ ఓడిపోయే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌ గా ఎన్ని గెలుస్తాం వంటి లెక్కలు వేసకుంటున్నారు. 


ఇక రాష్ట్రంలో ఏ ఇద్దరిని కదిపినా గెలిచేదెవరన్న చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం..ఏ జిల్లాల్లో వైసీపీ, టీడీపీ మధ్య టైట్ ఫైట్ ఉందో ఓసారి పరిశీలిద్దాం.. శ్రీకాకుళం జిల్లాలో మూడు నాలుగు స్థానాల్లో టైట్ పైట్ నడిచింది. విజయనగరం జిల్లాలో రెండు నుంచి మూడు స్థానాల్లో టైట్ ఫైట్ నడిచింది. 

విశాఖపట్నంలో నాలుగు నుంచి ఐదు స్థానాల్లో టైట్ పైట్ నడిచింది. తూర్పుగోదావరి జిల్లాలోనూ నాలుగు స్థానాల్లో నెక్ టు నెక్‌ ఫైట్ నడిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు చోట్ల త్రిముఖ పోటీ సాగింది. కృష్ణా జిల్లాలో నాలుగు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంది. 

గుంటూరు జిల్లాలో ఆరు స్థానాల్లో హోరాహోరీ పోరు సాగింది. కర్నూలు జిల్లాలో మూడు స్థానాల్లో నెక్ టు నెక్ పైట్ సాగింది. రెండుచోట్ల త్రిముఖ పోటీ ఉంది. అనంతపురం జిల్లాలో రెండు, మూడు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంది. మరి ఈ హోరాహోరీ స్థానాల్లో జెండా ఎగరేసేదెవరో  విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: