చంద్రబాబునాయుడు రాజకీయ దురంధరుడు. ఆయన వ్యూహాలకు ఎవరూ సాటిరారు. వర్తమాన రాజకీయ రంగంలో బాబును మించిన వ్యూహకర్తలు లేరంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు మనుషుల మీదనే కాదు, మనసుల మీద కూడా కమాండ్ చేయగల దిట్ట. ఆయన పక్కాగా ప్లాన్ వేస్తే అది సక్సెస్ కావాల్సిందే.

 


విషయానికి వస్తే ఏపీలో పోలింగ్ ఈసారి రికార్డ్ స్థాయిలో జరుగుతుందని అందరూ అంచనా వేశారు. అయితే ఇప్పటికి ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఎపి వ్యాప్తంగా మొత్తం మీద 79.5 శాతం ఓట్ల పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఈసారికి వచ్చిన వూపు వల్ల పోలింగ్ 85 శాతానికి మించుతుందని ఓ దశలో అంచనాలు వచ్చాయి. కానీ గత సారి కంటే కేవలం మూడు శాతం మాత్రమే పోలింగ్ పెరిగింది.

 


ఓ వైపు ఏపీలో కొత్త ఓటర్లు పెరిగారు. దాదాపు అరకోటి పైగా ఓటర్లు తొలిసారి ఓటు వేయబోతున్నారని అన్నారు. ఇవన్నీ తీసుకుంటే పోలింగ్ శాతం గణనీయంగా పెరగాలి. మరి ఎందుకు 80 శాతానికి కూడా రీచ్ కాలేదు. ఈ సందేహం అందరిలోనూ ఉంది. దానికి చంద్రబాబు వ్యూహాలే కారణం. బాబు పోలింగ్ రోజున ప్రభంజనం లాంటి తీర్పు రాబోతోందని వూహించారు. దాంతో ఆయన పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే ముప్పయి శాతం ఈవీఎంలు పనిచేయడంలేదని భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే కాదు. సైకిల్ కి వేస్తే ఫ్యాన్ కి వెళ్తున్నాయి ఓట్లు అంటూ సొంత పార్టీ ప్రచారం కూడా చేసుకున్నారు. ఇక గొడవలు విపరీతంగా జరిగినట్లుగా అనుకూల మీడియాలో చూపించారు.

 


ఇవనీ చూసిన జనం ఓటింగులు వెళ్ళడం కంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ అని డిసైడ్ అయ్యారు. దాంతో ఓ దశలో ఉధ్రుతంగా రావాల్సిన పోలింగ్ నెమ్మదించింది. సాయంత్రానికి పోలింగ్ పెరిగినా అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. పోలింగ్ శాతం ఎంత ఎక్కువ పెరిగితే అది అంతగా ప్రతిపక్షానికి అడ్వాంటేజ్. బాబు తన వ్యూహ రచనా చాతుర్యంతో నాలుగైదు శాతం పోలింగ్ పెరగకుండా ఆపేశారని అంటున్నారు. మరి ఓ విధంగా బాబు సాధించిన విజయమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి. ఇది ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: